AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.60తో మొదలైన ఉపాధ్యాయ ప్రస్థానం.. నేడు జాతీయ అవార్డు అందుకున్న టీచర్‌ సుమన్ గోయల్!

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువును మధ్యలో ఆపకుండా.. తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే తన చదువును కొనసాగించిన సుమన్ గోయల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రోజుకు రూ.60తో పాఠాలు చెప్పడం ప్రారంభించిన ఆమె.. విద్యార్థుల కోసం ప్రత్యేక మ్యాథ్స్ కిట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, స్వెటర్లు అందిస్తూ సేవలందిస్తున్నారు. ఆమె విద్యా సేవలు, వినూత్న బోధనా విధానాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది..

రూ.60తో మొదలైన ఉపాధ్యాయ ప్రస్థానం.. నేడు జాతీయ అవార్డు అందుకున్న టీచర్‌ సుమన్ గోయల్!
Inspiring Journey Of Suman Goyal
Srilakshmi C
|

Updated on: Sep 29, 2026 | 2:19 PM

Share

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలామంది చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యోగం వైపు అడుగులు వేస్తారు. అరకొర చదువులతో, చాలీచాలని జీతాలతో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే హరియాణాకు చెందిన సుమన్ గోయల్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఆర్థిక కష్టాల మధ్య తాత్కాలిక ఉద్యోగిగా పాఠాలు చెబుతూనే తన చదువును కొనసాగించారు. ఒకప్పుడు తనకు అండగా నిలిచిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరి రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. విద్యార్థుల కోసం చేసిన వినూత్న కార్యక్రమాలు, సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమెను 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.

పేదరికం మధ్య చదువుపై పట్టుదల

హరియాణాలో పుట్టి పెరిగిన సుమన్‌ది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ చూపినప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఆమె కెరీర్‌ కలలకు అడుగడుగునా అడ్డుగా నిలిచాయి. డాక్టర్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. అయితే ఇంటర్‌ చదివించేందుకు కూడా కుటుంబ సభ్యులు వెనుకంజ వేశారు. చదువు కొనసాగించడం కుటుంబానికి అదనపు ఆర్థిక భారంగా భావించారు. దీంతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ చదువుకోవాలని సుమన్‌ నిర్ణయించుకున్నారు. ఉపాధి అవకాశాల కోసం కుటుంబం దిల్లీకి తరలివెళ్లిన సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పాఠాలు చెప్పే అవకాశం ఆమెకు లభించింది. రోజుకు కేవలం రూ.60 మాత్రమే వేతనం లభించినా.. ఆ మొత్తాన్ని పొదుపు చేసి తన కాలేజీ ఫీజులకు ఉపయోగించుకునేవారు.

కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు

చదువు, ఉద్యోగంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలోనే సుమన్‌కు వివాహమైంది. కొంతకాలానికే ఆమె తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యానికి గురై మంచానపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో ఆమె తీవ్ర విషాదానికి గురయ్యారు. అయినప్పటికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగారు. తన లక్ష్య సాధనలో భర్త గౌరవ్‌ సహకారం కూడా లభించింది. అత్తమామలు సైతం ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలన్న తన కలను సుమన్‌ సాకారం చేసుకున్నారు. తాను ఒకప్పుడు కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేసిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరి దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గణితంపై భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేక కిట్‌

ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సుమన్‌ బోధిస్తున్నారు. చిన్నారుల్లో గణితం అంటే భయం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన ఆమె.. ఆ భయాన్ని తొలగించేందుకు వినూత్న పద్ధతులను అనుసరించారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా సంఖ్యలు, అంకెలను సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేక మ్యాథ్స్‌ కిట్‌ను అభివృద్ధి చేశారు. ఆ కిట్‌ ద్వారా గణితంలోని ప్రాథమిక అంశాలను ఆటపాటల తరహాలో సులభంగా నేర్చుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చిన్న వయసులోనే గణితంపై భయం తొలగితే భవిష్యత్తులో ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుందని ఆమె భావిస్తున్నారు.

రాష్ట్ర అవార్డు నుంచి జాతీయ పురస్కారం వరకు

సుమన్‌ సేవలు తరగతి గదికే పరిమితం కాలేదు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే కావడంతో వారికి అవసరమైన స్వెటర్లు, స్టేషనరీ, పుస్తకాలు తదితరాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. చిన్న చిన్న ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తన వంతు సహాయం చేస్తుంటారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల కోసం సుమన్‌ చేస్తున్న సేవలను గుర్తించిన హరియాణా ప్రభుత్వం గతంలోనే ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కరించింది. తాజాగా ఆమె విద్యా సేవలు, వినూత్న బోధనా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న సహాయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. రోజుకు రూ.60తో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి.. ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ చదువును కొనసాగించి.. తాను పనిచేసిన పాఠశాలకే ఉపాధ్యాయురాలిగా తిరిగి వచ్చి వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన సుమన్‌ గోయల్‌ ప్రస్థానం నిజంగా ఆదర్శప్రాయమే.

Follow Us
రూ.60తో మొదలై జాతీయ అవార్డు వరకు.. సుమన్ గోయల్ ఉపాధ్యాయ ప్రస్థానం
రూ.60తో మొదలై జాతీయ అవార్డు వరకు.. సుమన్ గోయల్ ఉపాధ్యాయ ప్రస్థానం
కూతురు వేలకోట్లకు యువరాణి.. తల్లి మాత్రం పల్లెటూరిలో..!
కూతురు వేలకోట్లకు యువరాణి.. తల్లి మాత్రం పల్లెటూరిలో..!
అతడిని టచ్ చేయలేరు.. వేలెత్తి చూపిస్తే బ్యాట్‌తోనే రిప్లై
అతడిని టచ్ చేయలేరు.. వేలెత్తి చూపిస్తే బ్యాట్‌తోనే రిప్లై
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
చుండ్రును నివారించి.. జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుతమైన ఆకు కూర
చుండ్రును నివారించి.. జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుతమైన ఆకు కూర
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు!
వారి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
వారి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
పితృ పక్షంలో పొరపాటున చేయకూడని పనులివే.. చేస్తే పేదవారే
పితృ పక్షంలో పొరపాటున చేయకూడని పనులివే.. చేస్తే పేదవారే
పులిసిన, పాతబడిన పెరుగు తింటున్నారా? అయితే, శరీరంలో జరిగేది ఇదే!
పులిసిన, పాతబడిన పెరుగు తింటున్నారా? అయితే, శరీరంలో జరిగేది ఇదే!
అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి..
అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి..