AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanuts Side Effects: మీరు వేరుశెనగలును తింటున్నట్లయితే.. ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.. లేకపోతే ప్రమాదమే..!

వేరుశెనగలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. అలాగే భారతదేశంలో దాదాపుగా అందరూ వేరుశెనగలు తింటారు. దీనిని చౌక బాదం అని కూడా పిలుస్తారు. చలికాలంలో చాలా..

Peanuts Side Effects: మీరు వేరుశెనగలును తింటున్నట్లయితే.. ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.. లేకపోతే ప్రమాదమే..!
Side Effects Of Peanuts
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 10, 2023 | 1:46 PM

Share

వేరుశెనగలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. అలాగే భారతదేశంలో దాదాపుగా అందరూ వేరుశెనగలు తింటారు. దీనిని చౌక బాదం అని కూడా పిలుస్తారు. చలికాలంలో చాలా మంది వేరుశెనగలను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్, పిండి పదార్థాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ఇది కొంతమందికి చాలా హానికరం. వారికి దీని వల్ల అలర్జీ సమస్యలు ఏర్పడుతాయి. అజీర్ణంతో సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. రక్తపోటు, గుండె సంబంధిత రోగులు కూడా తీసుకోవద్దు. అలాగే ఎవరెవరు ఈ వేరుశెనగలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మీ బరువు ఎక్కువగా ఉంటే వేరుశెనగను తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండడం వల్ల ఇది మీ బరువును మరింత పెంచుతుంది.
  2. అజీర్ణంతో సమస్యలు ఉన్నవారు లేదా కడుపు సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకు దూరంగా ఉండాలి.  ఎందుకంటే వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
  3. వేరుశెనగను అధికంగా తీసుకుంటే ఇందులోని సోడియం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. అందుకే తక్కువ పరిమాణంలో మాత్రమే వేరుశెనగలను తినాలి.
  4. వేరుశెనగ ఎక్కువగా తినడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. కాలేయం బలహీనంగా ఉన్నవారు వేరుశెనగ తినకుండా ఉండాలి. దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు వేగంగా పెరుగుతారు. అందుకే దూరంగా ఉండాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ సమస్య ఏర్పడుతుంది. శరీరంపై వాపు, ఎర్రటి దద్దుర్లు, దురద, కురుపులు వస్తాయి. మీకు అలెర్జీ ఉన్నట్లయితే వేరుశెనగ తినకుండా ఉండాలి. లేదా తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..