Food: జామకాయ తియ్యగా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.. కట్‌ చేయకుండానే..

కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో లభించే పండ్లలో జామకాయ ఒకటి. తక్కువ ఖర్చులో లభించే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెండం, జీర్ణ వ్యవస్థకు మేలు చేయడం వంటి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ పండ్లను ఎంపిక చేసుకునే సమయంలో...

Food: జామకాయ తియ్యగా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.. కట్‌ చేయకుండానే..
Guava
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 03, 2023 | 8:11 PM

కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో లభించే పండ్లలో జామకాయ ఒకటి. తక్కువ ఖర్చులో లభించే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెండం, జీర్ణ వ్యవస్థకు మేలు చేయడం వంటి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ పండ్లను ఎంపికచేసుకునే సమయంలో పండు రుచి ఎలా ఉందో తెలుసుకోవడం పెద్ద టాస్క్‌.. మనం బాగుంటుందని తీసుకున్న పండు కాస్త కోసిన తర్వాత చేదుగా ఉండొచ్చు. మరి జామకాయను కొనేముందే వాటి రుచిని అంచనా వేయొచ్చని మీకు తెలుసా.? కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటించడం ద్వారా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* జామకాయను కొనుగోలు చేసే సమయంలో దాని రంగును పరిగణలోకి తీసుకోవాలి. జామకాయ పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. అయితే కొందరు కాస్త పుల్లగా ఉండే పండ్లను ఇష్టపడతారు. అలాంటి వాళ్లు ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లను తీసుకోవాలి. ఇక ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసి ఉంటే పండ్లలో ఏదో సమస్య ఉందని భావించారు.

* ఇక వాసన ద్వారా కూడా జామకాయ రుచిని అంచనా వేయొచ్చు. తియ్యగా ఉండే జామకాయల వాసన కాస్త తీపి వాసనను కలిగి ఉంటాయి.

* సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉండే జామ పండ్లు తీపిగా ఉండవు. అంతేకాకుండా బరువు ఎక్కువ ఉన్న జామకాయల్లో గింజలు గట్టిగా ఉంటాయి. వీటి వల్ల తినే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి బరువు తక్కువ ఉండే కాయలను ఎంచుకోవాలి.

* మచ్చలు ఉన్న జాకయాలను కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వాటిపై పురుగుల మందులను ఎక్కువగా పిచికారీ చేసినవిగా భావించాలి. అంతేకాకుండా జామకాయలను కొనుగోలు తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..