Spinach Juice Benefits: పాలకూర జ్యూస్ తాగడం వల్ల బంఫర్ బెనిఫిట్స్.. పొట్టలోని గ్యాస్, అతి బరువు సమస్య మటాష్..
పాలకూరలోని క్యాల్షియం, విటమిన్ K ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పాలకూరలోని ఆక్సీకరణ నిరోధకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. పాలకూరలో ఆక్సాలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది

తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు కలిగి ఉండటంతో పాలకూర ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. పాలకూరలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరను రోజు తినే వారిలో అనేక సమస్యలు దూరమవుతాయి. పాలకూరతో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇది సులువుగా జీర్ణం అవుతుంది. పాలకూరలోని విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, వయసుతో సంబంధం ఉన్న కంటి సమస్యలను నివారిస్తుంది. ప్రతిరోజు పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
పాలకూరను రోజు తింటే వెంట్రుకల సమస్యలు, కళ్ల సమస్యలు దూరమవుతాయి. ఇందులో విటమిన్ కె, ఎ, ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో కీలక ప్రాత పోషిస్తాయి. కడుపులోని గ్యాస్,ఉబ్బటం వంటి ప్రాబ్లమ్ లు కూడా దూరమవుతాయి. రోజు పరగడుపున పాలకూర జ్యూస్ చేసుకుని, దానిలో చక్కెర కల్పి తాగాలి. ఇలా తాగితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.
విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచి జబ్బుల బారిన పడకుండా సహాయపడుతుంది. ఫోలేట్ గర్భవతులకు, శిశువుల అభివృద్ధికి అవసరం. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. పాలకూరలోని పోషకాలు రక్తపోటును నియంత్రించడానికి, హృదయ స్పందన రేటును తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. పాలకూరలోని క్యాల్షియం, విటమిన్ K ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పాలకూరలోని ఆక్సీకరణ నిరోధకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. పాలకూరలో ఆక్సాలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గౌట్ వ్యాధి ఉన్నవారు పాలకూరను తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..