Chilli Garlic Noodles: వర్షాకాలంలో స్పైసీగా నూడుల్స్ తినాలని ఉందా.. చిల్లీ గార్లిక్ నూడుల్స్ ట్రై చేయండి.. రెసిపీ..
చైనీస్ ఆహారాల శైలి. చైనీస్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. రక రకాల వంటకాలున్నా. సాధారణంగా చైనీస్ ఆహారం అంటే నూడిల్స్ గుర్తుకొస్తాయి. ఇవి చైనీస్ వంటకాల్లో ప్రధాన స్థానం లో ఉంటాయి. గోధుమ పిండి, బియ్యం లేదా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. వేయించిన నూడుల్స్, సూప్ నూడుల్స్, చల్లని నూడుల్స్, చిల్లి గార్లిక్ న్యూడుల్స్ ఇలా రకరకాలుగా వండుతారు. ఈ రోజు వర్షాకాలంలో స్పైసీ గా నూడుల్స్ తినాలంటే చిల్లీ గార్లిక్ నూడుల్స్ ట్రై చేయండి. రెసిపీ

Chilli Garlic Noodles
చిల్లీ గార్లిక్ నూడుల్స్ .. అందరూ ఇష్టపడే రుచికరమైన, కారంగా ఉండే వంటకం. ముఖ్యంగా చైనీస్ ఆహారాన్ని ఇష్టపడే వారు ఈ చిల్లీ గార్లిక్ నూడుల్స్ ని అమితంగా ఇష్టపడతారు. చిల్లీ గార్లిక్ నూడుల్స్ అంటే మసాలా, వెల్లుల్లి, మిరపకాయలతో తయారు చేసే ఒక రుచికరమైన వంటకం. దీనిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా చిల్లీ గార్లిక్ నూడుల్స్‌ను ఆస్వాదించాలనుకుంటే.. మీ కోసం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో తెలిపే రెసిపీ ఉంది.
కావాల్సిన పదార్ధాలు:
- నూడుల్స్ – 200 గ్రాములు
- నూనె- 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి- 1 టేబుల్ స్పూన్ (తరిగిన ముక్కలు )
- పచ్చిమిర్చి- 1 టీస్పూన్ (తరిగిన ముక్కలు )
- ఉల్లిపాయ- 1/4 కప్పు (సన్నగా కట్ చేసిన ముక్కలు)
- క్యాప్సికమ్- 1/4 కప్పు ( కట్ చేసిన ముక్కలు)
- క్యారెట్లు- 1/4 కప్పు ( కట్ చేసిన ముక్కలు)
- సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు
- చిల్లీ సాస్- 1 టేబుల్ స్పూన్
- వెనిగర్- 1 టీస్పూన్
- చక్కెర- 1/2 టీస్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- మిరియాల పొడి- 1 టీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా ఒక పాత్రలో నీళ్లు మరిగించి.. అందులో నూడుల్స్ వేయండి.
- ఇప్పుడు నూడుల్స్ మెత్తబడకుండా 3-4 నిమిషాలు ఉడకబెట్టండి
- నూడుల్స్ ఉడికిన తర్వాత వాటిని వడకట్టి.. ఆపై నూడిల్స్ లో చల్లటి నీరు పోసి.. శుభ్రం చేసి, అవి ఒక దానితో మరొకటి అంటుకోకుండా ఉండటానికి కొంచెం నూనె కలపండి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి.. పాన్ లో నూనె వేసి వేడి చేసి.. తరిగిన వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసి తేలికగా వేయించండి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
- తరువాత క్యాప్సికమ్ , క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేయించండి.
- కూరగాయలకు సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, చక్కెర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. కొంచెం చక్కర వేసి కలపండి.
- ఇప్పుడు ఈ కూరగాయల మిశ్రమంలో ఉడికించిన నూడుల్స్ వేసి 2-3 నిమిషాలు పాటు తక్కువ మంట వేయించండి.
- ఉడికించిన నూడుల్స్ ను సాస్ లో కలిపి బాగా వేడి వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి..
- అంతే చిల్లీ గార్లిక్ నూడుల్స్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








