AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bachelor Special: 15 నిమిషాల్లో కుక్కర్‌లో స్పైసీ చికెన్ కర్రీ.. బ్యాచ్‌లర్స్ కోసం బ్రహ్మాండమైన కూర ఇది

చాలా మంది బ్యాచిలర్స్ కి వంట చేయడం అంటే పెద్ద పనిగా అనిపిస్తుంది. ముఖ్యంగా చికెన్ కర్రీ అంటే ఎక్కువ సమయం పడుతుందని భావిస్తారు. కానీ ప్రెజర్ కుక్కర్ ట్రిక్ ద్వారా మీరు చాలా తక్కువ సమయంలోనే, మంచి రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మసాలాలన్నీ మాగ్నేషన్ చేసి కుక్కర్‌లో వేయడం వల్ల చికెన్ ముక్కలకు రుచి బాగా పడుతుంది.

Bachelor Special: 15 నిమిషాల్లో కుక్కర్‌లో స్పైసీ చికెన్ కర్రీ.. బ్యాచ్‌లర్స్ కోసం బ్రహ్మాండమైన కూర ఇది
15 Minutes Chicken Curry Recipe
Bhavani
|

Updated on: Jun 05, 2026 | 11:06 AM

Share

కావలసిన పదార్థాలు:

చికెన్ – 1/2 కిలో (శుభ్రం చేసినది)

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

టమోటాలు – 2 (ముక్కలు చేసినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

కారం – 2 స్పూన్లు

ఉప్పు – తగినంత

పసుపు – 1/4 స్పూన్

ధనియాల పొడి – 1 స్పూన్

గరం మసాలా – 1/2 స్పూన్

నూనె – 3 స్పూన్లు

బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు – కొద్దిగా

కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం:

మొదటగా ఒక బౌల్‌లో శుభ్రం చేసిన చికెన్ తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 5-10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేయండి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉంచండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి, ఒకటి రెండు నిమిషాలు బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, చివరగా గరం మసాలా చల్లి కుక్కర్ మూత పెట్టండి. కేవలం 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, ఆవిరి పోయాక తీయండి. ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ సిద్ధం! చివరగా కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.

Follow Us
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
బ్యాచ్‌లర్స్... తగినంత సమయం లేనప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి
సింగిల్ టేక్‌లో రాంచరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
సింగిల్ టేక్‌లో రాంచరణ్ సిగ్నేచర్ స్టెప్పులతో ఇరగదీసిన ఫ్యాన్
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
ఏ పని చేపట్టినా పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నాయా?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
పాములు నిద్రిస్తున్నప్పుడు కళ్లు ఎందుకు తెరిచి ఉంచుతాయంటే?
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త! గుడ్ల ఆధారంగానే వర్షాలు!!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!
ఘాటైన మసాలాలతో నోరూరించే మటన్ తలకాయ కూర.. తయారీ విధానం ఇదే!
తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా..
తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా..
ఆ ఇద్దరు హీరోలతో నటించాలని ఉంది.. రంభ మనసులోని మాటలు..
ఆ ఇద్దరు హీరోలతో నటించాలని ఉంది.. రంభ మనసులోని మాటలు..
కుర్రాడిపై మహిళ వీరంగం.. జట్టు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా..
కుర్రాడిపై మహిళ వీరంగం.. జట్టు పట్టుకుని మరీ పొట్టుపొట్టుగా..