Sankranti 2024 Recipe: అరిసెలు రానివాళ్లు కూడా ఇలా చేస్తే ఫర్ఫెక్ట్‌గా వస్తాయి!
సంక్రాంతి పండుగ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి పిండి వంటలు. అందులోనూ సంక్రాంతి పండుగకి ఆంధ్రాలో ఎక్కువగా పిండి వంటలు చేస్తారు. జంతికలు, పాకుండలు, బొబ్బట్లు, అరిసెలు, సున్నండలు, రవ్ల లడ్డూ, గులాబీ పువ్వులు, కజ్జికాయలు ఇలా ఎవరికి ఇష్టం ఉన్నవి వాళ్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అరిసెలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అరిసెలు పురాతన వంటకం. పూర్వం నుంచి ఈ రెసిపీ చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న వారికి అరిసెలు చేయడం రాదనే చెప్పాలి. కాస్త శ్రమతో కూడుకున్నదైనా.. రుచి విషయం వచ్చేసరికి..

సంక్రాంతి పండుగ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి పిండి వంటలు. అందులోనూ సంక్రాంతి పండుగకి ఆంధ్రాలో ఎక్కువగా పిండి వంటలు చేస్తారు. జంతికలు, పాకుండలు, బొబ్బట్లు, అరిసెలు, సున్నండలు, రవ్ల లడ్డూ, గులాబీ పువ్వులు, కజ్జికాయలు ఇలా ఎవరికి ఇష్టం ఉన్నవి వాళ్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అరిసెలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అరిసెలు పురాతన వంటకం. పూర్వం నుంచి ఈ రెసిపీ చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న వారికి అరిసెలు చేయడం రాదనే చెప్పాలి. కాస్త శ్రమతో కూడుకున్నదైనా.. రుచి విషయం వచ్చేసరికి శ్రమ అంతా మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
బియ్యం, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె, నువ్వులు.
అరిసెలు తయారు చేయు విధానం:
అరిసెలు తయారు చేయడానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి.. మెత్తగా అరిసెలకు పిండి పట్టించాలి. ఈలోపు బెల్లం పాకం తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి.. ఖాళీగా ఉండే పాత్రలో బెల్లం తురుము, నీళ్లు పోసి బాగా కలపాలి. బెల్లం పాకం కలపడానికి చెక్క గరిటెను ఉపయోగించాలి. బెల్లం కరిగి బుడగలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. బెల్లం పాకం ఎలా ఉండాలంటే.. మీరు పాకాన్ని.. రౌండప్ చేస్తే ముద్దలా ఉండాలి. అలా బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ముందుగా ఆడించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి సరిపోయింది అనుకున్నప్పుడు.. ఈ మిశ్రమాన్ని గట్టిగా తిప్పుతూ ఉండాలి. దీన్ని కాసేపు కక్కు పెట్టుకోవాలి.
ఈ లోపు పెద్ద ఇనుప మూకిడి పెట్టి.. అందులో ఆయిల్ వేసుకుని వేడెక్కించాలి. ఆయిల్ వేడెక్కాక.. ఆయిల్ రాసిన ప్లేట్ లేదా కవర్ పై ముందుగా సిద్ధం చేసుకున్న పిండి ముద్దను తీసుకుని అరిసెలు షేప్‌లో చేసుకోవాలి. దానిపై కొద్దిగా నువ్వులు అద్దాలి. ఇప్పుడు మెల్లగా ఆయిల్‌లో వేయాలి. మంటను మీడియంలో పెట్టి.. గోధుమ రంగులోకి వచ్చేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత వీటిని రెండు అంట్ల కాడలతో గట్టిగా నొక్కితే.. ఆయిల్ అంతా బయటకు వెళ్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు సిద్ధం. మొదటి సారి చేసేవారు చాలా తక్కువ మొత్తంలోనే ట్రై చేస్తే బెటర్.




