AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prawns Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం …గోదావరి జిల్లా స్టైల్ లో రుచికరమైన రొయ్యల నిల్వ పచ్చడి తయారీ..

Prawns Pickle Recipe: ఆంధ్రా పచ్చళ్ల(Andhra Pickle) దేశ వ్యాప్తంగా ప్రసిద్ది. తెలుగువారికి నిల్వ పచ్చళ్ళకు విడదీయరాని బంధం ఉంది. వెజ్ ప్రియులకు ఆవకాయ, మాగాయ, చింతకాయ అనేక రకాల..

Prawns Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం …గోదావరి జిల్లా స్టైల్ లో రుచికరమైన  రొయ్యల నిల్వ పచ్చడి తయారీ..
Prawn Pickle Recipe
Surya Kala
|

Updated on: Jan 21, 2022 | 2:16 PM

Share

Prawns Pickle Recipe: ఆంధ్రా పచ్చళ్ల(Andhra Pickle) దేశ వ్యాప్తంగా ప్రసిద్ది. తెలుగువారికి నిల్వ పచ్చళ్ళకు విడదీయరాని బంధం ఉంది. వెజ్ ప్రియులకు ఆవకాయ, మాగాయ, చింతకాయ అనేక రకాల నిల్వ పచ్చళ్ళు ఉంటాయి. అయితే మరి నాన్ వెజ్ ప్రియులకు కూడా నిల్వ పచ్చళ్ళు ఉంటే బాగుండును అని అనుకుంటారు. చికెన్, రొయ్యలు వంటి పచ్చళ్ళను వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో రెసిపీ తెలిస్తే బాగుండును.. ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళం అనుకునేవారి కోసం ఈరోజు రొయ్యలతో నిల్వ పచ్చడి తయారీ నేర్చుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: రొయ్యలు గరం మసాలా పొడి (రెడీమేడ్ గా దొరికేది వేసుకోవచ్చు) లేదా (మసాలా తయారీకి ;లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు.. వీటిని నూనెల లేకుండా నార్మల్ గానే వేపించుకుని పొడి చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు… నిమ్మకాయలు పసుపు కారం తాలింపుకు పోపు దినుసులు నూనె

తయారీ విధానం : ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక దళసరి గిన్నె పెట్టుకుని రొయ్యలు వేసుకుని అందులో పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. నీరు తీసివేసీ వాటిలో . అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి.. అనంతరం ఒక కళాయిలో నూనె పోసి, బాగా కాగిన తరువాత అనంతరం రొయ్యలను వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేగిన రొయ్యలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ రొయ్యల మీద కారం.. గరం మసాలా పొడి కొంచెం పసుపు కాగిన నూనె పోసుకుని కలుపుకోవాలి.

తరవాత కొంచెం నూనె లో నిమ్మరసం వేసి కొంచెం వేడి చేసి రొయ్యల మీద వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి.. ఉప్పు ఒకసారి చూసుకోవాలి. అనంతరం గిన్నెలో నూనె వెసుకుని కర్వేపాకు , వెల్లుల్లి, ఎండు మిర్చి , జీలకర్ర వేసి పోపు పెట్టాలి.. సరిపడా నూనె వెసుకుని ఈ మిశ్రమాన్ని నీరు తగలకుండా జాడీలో భద్రపరచుకోవాలి. ఇలా తయారు చేసిన రొయ్యల ఆవకాయ తడి తగలకుండా ఉంచుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ వుంటుంది

Also Read:

వినుకొండలో బయటపడిన పురాతన లోహపు రాళ్లు.. గుప్త నిధులంటూ ప్రచారం.. చివరకు