Navratri 4th Day Naivedyam: రేపు నవరాత్రుల్లో నాలుగో రోజు.. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు.. తయారీ ఎలా అంటే..

Navratri 4rd Day Naivedyam: దసరా పండగను తొమ్మిదిరోజులు జరుపుకుంటారు. అమ్మవారిని తొమ్మిది రాత్రులు వివిధ రుపాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శక్తి స్వరూపిణి..

Navratri 4th Day Naivedyam: రేపు నవరాత్రుల్లో నాలుగో రోజు.. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు.. తయారీ ఎలా అంటే..
Navaratri 4th Day
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2021 | 8:37 PM

Navratri 4th Day Naivedyam: దసరా పండగను తొమ్మిదిరోజులు జరుపుకుంటారు. అమ్మవారిని తొమ్మిది రాత్రులు వివిధ రుపాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శక్తి స్వరూపిణి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి తమ శక్తి కొలది నైవేద్యం పెడతారు. రేపు నవరాత్రి నాలుగో రోజు.  కూష్మాండాదేవి, శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులతో పూజలను అందుకోనున్నారు. ఆ ఆది పరా శక్తి శ్రీ గాయత్రి దేవి కి నైవేద్యంగా కొంతమంది అల్లం మినప గారెలను పెడితే.. మరికొందరు మొక్కజొన్న వడలను పెడతారు. ఈరోజు అల్లం మినపగారెలు తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

పొట్టు మినపప్పు జీలకర్ర అల్లం పచ్చిమిరప కాయ కరివేపాకు కొత్తిమీర ఉప్పు రుచికి తగినంత నూనె వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా మినపప్పుని నీటిలో పోసుకుని నానబెట్టుకోవాలి. ఇలా 4,5 గంటల పాటు నానిన మినపప్పుని శుభ్రంగా పొట్టు తీసి కడుక్కోవాలి. అనంతరం ఆ పప్పుని గ్రైండర్ లో వేసుకుని నీరు తక్కువ వేసి.. గట్టిగా రుబ్బుకోవాలి. అనంతరం ఆ పిండిని ఒక గిన్నెలో తీసుకుని తగినంత ఉప్పు, జీలకర్ర, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి బాణలి పెట్టి..నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత ఆ నూనెలో మినప పిండి చేతితో రౌండ్ గా చేసుకుని దానికి చిల్లు పెట్టి.. వేడి నూనెలో వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఆ వడలను టిస్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అల్లం మినపగారెలు రెడీ.. గాయత్రీ దేవిని సలకల శుభాలు కలగాలంటూ పూజించి నైవేద్యంగా అల్లం మినపగారెలను సమర్పించి అనుగ్రహం పొందండి.

Also Read:  భాగ్యనగరంలో భారీ వర్షాలు..వరద ముంపులో కాలనీలు.. 150 కుటుంబాలను సురక్షిత ప్రాతాలకు తరలింపు..