Republic Day 2025 Recipes: రిపబ్లిక్ డేకి మూడు రంగులతో ఇలా కలర్‌ఫుల్ వంటలు చేయండి..

ఆగష్టు 15, రిపబ్లిక్ డే రోజున చాలా మంది మూడు రంగులతో కూడిన డ్రెస్సింగ్ ధరిస్తూ ఉంటారు. ఇది చూపరులను కూడా ఆకట్టుకుంటుంది. మరికొంత మంది అనేక రెసిపీలు తయారు చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈసారి మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకు సర్‌ప్రైజ్ చేయండి. మూడు రంగులతో ఎంతో కలర్‌ ఫుల్‌గా కనిపస్తాయి..

Republic Day 2025 Recipes: రిపబ్లిక్ డేకి మూడు రంగులతో ఇలా కలర్‌ఫుల్ వంటలు చేయండి..
Republic Day 2025 Recipes (1)

Updated on: Jan 24, 2025 | 6:27 PM

గణతంత్ర దినోత్సవం దగ్గర పడింది. ప్రతీ ఏటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేని ఎంతో ఘణంగా సెలబ్రేట్ చేస్తుంది ప్రభుత్వం. త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి శుభాకాంక్షలు చెబుతారు. దేశ వ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. చాలా వరకు ఆగష్టు 15, రిపబ్లిక్ డే రోజున చాలా మంది మూడు రంగులతో కూడిన డ్రెస్సింగ్ ధరిస్తూ ఉంటారు. ఇది చూపరులను కూడా ఆకట్టుకుంటుంది. మరికొంత మంది అనేక రెసిపీలు తయారు చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈసారి మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకు సర్‌ప్రైజ్ చేయండి. మూడు రంగులతో ఎంతో కలర్‌ ఫుల్‌గా కనిపస్తాయి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలా అని కొంత మందికి తోచదు. అలాంటి వారికి ఈ టిప్స్ హెల్ప్ చేస్తాయి.

ఇడ్లీ:

ఎంతో ఈజీగా మూడు రంగులతో కలిపి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. తెలుపు రంగుకు సాధారణంగా వాడే ఇడ్లీ పిండి వాడవచ్చు. గ్రీన్ కలర్ కావాలంటే.. పాలకూర పేస్ట్ లేదా పచ్చి మిర్చి పేస్ట్ వాడవచ్చు. ఇక ఆరెంజ్ కలర్ కోసం.. క్యారెట్ తురుము లేదా రసాన్ని ఉపయోగించవచ్చు. ఈ మూడు రంగులతో కలిపి ఇడ్లీ తయారు చేస్తే చూడటానికి కూడా ఎంతో కలర్ ఫుల్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దోశలు:

దోశలను కూడా మూడు రంగులతో ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా చేసుకోవచ్చు. పైన చెప్పినట్టే దోశల బ్యాటర్‌లో కూడా పాలకూర పేస్ట్, క్యారెట్ మిశ్రమాన్ని ఉపయోగించి మూడు రంగులతో దోశలు తయారు చేయవచ్చు.

సాండ్ విచ్:

సాండ్ విచ్‌ని కూడా మూడు రంగులతో ఇంట్రెస్టింగ్‌గా తయారు చేసుకోవచ్చు. ఇవి రుచిగానే కాకుండా చూడటానికి కూడా ఎంతో టెంప్టీగా ఉంటాయి.

రైస్ ఐటెమ్స్:

రైస్‌తో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. ఇలానే మూడు రంగుల కాంబినేషన్‌తో రైస్ ఐటెమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూర రైస్, క్యారెట్ రైస్, వైట్ రైస్‌గా చేయవచ్చు.

స్వీట్స్:

స్వీట్స్‌ని కూడా ఇదే మూడు రంగులతో ఎంతో ఆకర్షణీయంగా, నేచురల్ పదార్థాలను ఉపయోగించి తయారు చేయవచ్చు. ఇలా ఒకటి కాదు.. రెండు.. కాదు మనసు పెడితే మీలో కొత్త కలను బయటకు తీయవచ్చు.