
మనం తీసుకునే ఆహారం బట్టి.. ఒక్కో అవయవానికి మంచిదన్న విషయం మీకు తెలుసా.. అవును మీరు విన్నది నిజమే. మనం రోజూ తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకు కూరలు, పలు రకాల ఫ్రూట్స్ ఉంటాయి. వాటి రంగును బట్టి.. మన శరీరంలో కొన్ని రకాల అవయవాల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో కొన్ని పార్ట్స్ కి కొన్ని రంగులతో కూడిన ఆహారం అవసరం అవుతుందట. మరి ఏ రంగు ఆహారం తీసుకుంటే.. శరీరంలోని వివిధ భాగాలకు ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ కలర్ ఆహారాలు:
ఎరుపు రంగులో మనకు లభ్యమయ్యే కాయ గూరలు, పండ్లు తీసుకుంటే.. శరీరంలోని గుండెను కాపాడుకోవచ్చట. అంతే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు, రోగాలు దరి చేరకుండా చూసుకోవచ్చని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఎరుపు రంగులో ఉండే టమాటాలు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీస్, జామ, బీట్ రూట్, క్యారెట్ ఇలా ఎరుపు రంగులో మనకు లభ్య మయ్యే ఆహారాలు తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుంది.
ఆకు పచ్చ ఆహారాలు:
ఆకు పచ్చ రంగులో ఉండే కాయ గూరలు, ఆకు కూరలు, పండ్లు తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట. ఆకు పచ్చ రంగులో మనకు ద్రాక్ష, గ్రీన్ యాపిల్, జామ, బెండకాయలు, దొండకాయలు, క్యాబేజీ, తోట కూడర, పాల కూర, మెంతి కూర ఇలా ఆకు పచ్చ రంగులో ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే కాలేయాన్ని హెల్దీగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ కలర్ ఆహారాలు:
నలుగు రంగులో ఉండే కాయ గూరలు, పండ్లు తీసుకుంటే మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. నలుపు రంగులో ఉండే వంకాయలు, ద్రాక్ష, బ్లాక్ ఆలీవ్ ఇలా మనకు లభ్యమయ్యే వాటిని తీసుకుంటే మూత్ర పిండాలు చక్కగా పని చేస్తాయడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు.
ఊదా రంగు ఆహారాలు:
ఊదా రంగులో ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకు కూరలు తీసుకుంటే మెదడు హెల్దీగా ఉంటుందట. ఊదా ద్రాక్ష, ఉల్లి పాయలు, ఊదా రంగు క్యాబేజీ, వంకాయలు వంటివి తీసుకుంటే మెదడు హెల్దీగా పని చేస్తుంది.
తెలుపు రంగు ఆహారాలు:
తెలుపు రంగు కాయ గూరలు, పండ్లు తినడం వల్ల ఊపిరి తిత్తులకు మేలు చేస్తాయట. వెల్లుల్లి, తెల్ల పుట్ట గొడుగులు, ముల్లంగి, సీతాఫలం, జామ, కొబ్బరి వంటివి తినడం వల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా పని చేయడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. హార్మోన్లు సమతుల్యంగా ఉండేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి.
పసుపు రంగులో ఉండే ఆహారాలు:
పసుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ, కండరాలు చక్కగా పని చేసేలా చూస్తాయి. దీంతో గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు దరి చేరవు. పసుపు రంగులో ఉండే గుమ్మడి కాయ, క్యాప్సికం, అరటి పండు, మామిడి కాయ, బత్తాయి, నారింజ, మొక్క జొన్న, ఎల్లో క్యారెట్, పైనాపిల్ వంటివి తింటే ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.