AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Benefits: పరగడుపున టమాటాలు తింటే.. ఆ సమస్యలే ఉండవు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Benefits Of Tomato: టమాటాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అన్ని వంటకాల్లో వినియోగిస్తారు. ఆహార రుచిని పెంచే టమాటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

Tomato Benefits: పరగడుపున టమాటాలు తింటే.. ఆ సమస్యలే ఉండవు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Tomato
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2022 | 9:51 AM

Share

Benefits Of Tomato: టమాటాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అన్ని వంటకాల్లో వీటిని వినియోగిస్తారు. ఆహార రుచిని పెంచే టమాటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. టమాటతో చట్నీ, కూర, సూప్, జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని సలాడ్ రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ టమాటా (Tomato) ల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు టమాటాలను క్రమం తప్పకుండా, సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటాలతో చేసిన ఆహారం, జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది పలు అధ్యయనాల్లో కూడా తేలింది. ఈ రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం వల్ల కలిగే (Health Tips)ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి: ఈ కరోనా యుగంలో రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత ఎంటో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది శక్తిని పెంచడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు టమాటాల సహాయం తీసుకోవచ్చు. టొమాటో శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటో రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు. టమాటా రసం తాగడమే కాకుండా తినడం కూడా మంచిదే. దీనివల్ల చర్మ సమస్యలు కూడా దూరమై మెరుస్తుంది.

వేడి: ఉదరంలో వేడి సమస్య వస్తే ఏమీ తినాలనిపించదు. మీకు కడుపులో వేడి, మంట సమస్య అనిపిస్తే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది.. అలాగే రోజంతా మీరు మంచి అనుభూతి చెందుతారు. టమోటాలు తినడం వల్ల రోజంతా మీ శరీరంలో శక్తి ఉంటుంది.

కంటిచూపు: కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, కాంతిని పెంచేందుకు పచ్చి కూరగాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కళ్లే కాదు చర్మ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

Also Read:

Drumstick leaves: మునగాకు తింటున్నారా.. అయితే వాటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Health Tips: ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకునేందుకు ఈ నాలుగు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి