Thati Munjalu: ఏంటి ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు

ఐస్ యాపిల్ లేదా తాటి ముంజలు... ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. సిటీల్లో ఆకుల మధ్యలో ఉంచి అమ్ముతుంటారు. లేత తాటి ముంజలు ఎండ వేడిమి నుంచి కాపాడతాయి.

Thati Munjalu: ఏంటి ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు
Ice Apple
Follow us

|

Updated on: Apr 27, 2022 | 3:30 PM

Ice Apple Health Benefits : సమ్మర్ వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అయితే వీటన్నింటికి కంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి.  గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా దొరుకుతుంటాయి. సిటిల్లో మాత్రం భారీ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సిందే.

ఎన్నో పోషక విలువలు : 

  1. తాటి ముంజల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి. విటమిన్ ఏ అధికశాతంలో ఉంటుంది. విటమన్ బి, సి, జింక్, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉంటాయి.
  2. 100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి
  3. శరీరంలోని వ్యర్థాలన్నింటిని కూడా ముంజలు బయటకు పంపేస్తాయి. మలబద్దకాన్ని తరమికొడతాయి.
  4. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
  5. శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది.
  6. మొటిమలు తగ్గించడానికి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు నిర్మూలనలో కూడా ముంజలు చాలా హెల్ప్ చేస్తాయి.
  7. గర్భిణులకు మంచి బలాన్ని ఇస్తాయి. చాలామంది ముంజలకు చుట్టూ ఉండే పొట్టు తీసి తింటారు. వాస్తవానికి ఆ పొట్టుతోనే ఎక్కువ ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
  8. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం
  9. మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read: Viral Video: అయ్యయ్యో భలే పని జరిగిందే..? కొత్త కోడలికి ఊహించని అనుభవం