ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు. ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఉల్లిపాయ లేనిదే ఏ కూర కూడా పూర్తి కాదు. ఉల్లిపాయతో కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మం, జుట్టును కూడా కాపాడుకోవచ్చు. ఉల్లిపాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. అలాగే ఇప్పటికవరకూ ఎన్నో రకాల ఊరగాయలు తినే ఉంటారు. కానీ ఉల్లిపాయ ఊరగాయ ఎప్పుడైనా తిన్నారా? ఇది అన్నంతో, బ్రేక్ ఫాస్ట్‌తో, చపాతీతో తిన్నా చాలా బావుంటుంది. మరి ఉల్లిపాయ ఊరగాయను ఎలా తయారు చేస్తారు? ఉల్లిపాయ ఊరగాయకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, చింత పండు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆయిల్.
ఈ ఉల్లిపాయ ఊరగాయ తయారు చేయడానికి.. ముందుగా చింత పండును నానబెట్టి.. గుజ్జు తీసి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. వీటిని పక్కకు ఉంచి.. చల్లారాక మిక్సీలో మెత్తగా పౌడర్‌లా పెట్టాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఒక్కోస్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. నెక్ట్స్ ఎండు మిర్చి, నెక్ట్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేయాలి.
ఇవి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తబడేంత వరకూ వేయించాలి. ఇవి బాగా వేగాక.. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్, చింత పండు గుజ్జు వేసి బాగా కలిపి.. ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఉల్లి పాయ ఊరగాయ తయారవుతుంది. ఇది చల్లారాక.. గాజు సీసాలో వేసి నిల్వ చేయాలి. ఈ ఉల్లి ఊరగాయ పది రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే.. నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది.