Ulavacharu Veg Biryani: ఈసారి సండేకి ఉలవ చారు వెజ్ బిర్యానీ చేయండి.. టేస్ట్ అదుర్స్..

| Edited By: Ravi Kiran

Aug 25, 2024 | 3:00 PM

ఈ మధ్య కాలంలో ఉలవ చారు వెజ్ బిర్యానీ చాలా ఫేమస్ అయ్యింది. ఈ కాంబినేషన్ గురించి చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది. దీని కోసం చాలా మంది రెస్టారెంట్లకు వెళ్లి తింటూ ఉంటారు. కానీ వాళ్లు ఎలా చేస్తారో అన్న భయం అయితే మనసులో ఉంటుంది. కానీ ఇకపై టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎంతో ఈజీగా, సింపుల్‌గా, తక్కువ సమయంలోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఉలవచారు తినడం ఆరోగ్యానికి..

Ulavacharu Veg Biryani: ఈసారి సండేకి ఉలవ చారు వెజ్ బిర్యానీ చేయండి.. టేస్ట్ అదుర్స్..
Ulavacharu Veg Biryani
Follow us on

ఈ మధ్య కాలంలో ఉలవ చారు వెజ్ బిర్యానీ చాలా ఫేమస్ అయ్యింది. ఈ కాంబినేషన్ గురించి చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది. దీని కోసం చాలా మంది రెస్టారెంట్లకు వెళ్లి తింటూ ఉంటారు. కానీ వాళ్లు ఎలా చేస్తారో అన్న భయం అయితే మనసులో ఉంటుంది. కానీ ఇకపై టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎంతో ఈజీగా, సింపుల్‌గా, తక్కువ సమయంలోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఉలవచారు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చెప్పే ప్రాసెస్‌లో చేస్తే ఎంతో త్వరగా వంట ముగించవచ్చు. మరి ఉలవ చారు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉలవ చారు వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ రైస్, బంగాళ దుంపలు, ఆలు, ఉల్లిపాయ, కాలీ ఫ్లవర్ ముక్కలు, బిర్యానీ దినుసులు, కారం, ఉప్పు, పసుపు, కారం, నెయ్యి, కారం, ఉలవలు, చింత పండు గుజ్జు.

ఉలవ చారు వెజ్ బిర్యానీ తయారీ విధానం:

ముందుగా ఉలవలను శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు అయినా నానబెట్టాలి. ఎందుకంటే ఇవి త్వరగా ఉడకవు. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి 5 లేదా 6 విజిల్స్ అయినా ఉడికించాలి. ఇప్పుడు నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు నీటిని కూడా కలిపి స్టవ్ మీద మీడియం మంట మీద పెట్టి ఉడికించాలి. ఇలా పావు గంట సేపు మరిగాక.. మళ్లీ నీటిని వడకట్టి గుజ్జును పక్కకు పెట్టుకోవాలి. ఈ నీటితోనే ఇప్పుడు బిర్యానీ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె తీసుకోండి. అందులో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ నెక్ట్స్ బిర్యానీ దినుసులు వేసి వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసి ఓ ఐదు నిమిషాలు ఆయిల్‌లో వేయించాక.. కారం, ఉప్పు, పసుపు వేసి ఓ పది నిమిషాలు కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేసి కలపాలి. ఇప్పుడు బియ్యం కొలతకు సరిపడగా పక్కన పెట్టిన ఉలవల నీటిని, చింత పండు గుజ్జు కొద్దిగా వేసి మిక్సీ చేసి అన్నీ రుచి చూసుకుని మూత పెట్టి మీడియం మంట మీద కుక్ చేయండి. దగ్గర పడుతున్న సమయంలో చిన్న మంట పెట్టాలి. వెజ్ బిర్యానీ సిద్దం అయ్యాక కొత్తిమీర చల్లి తినడమే. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.