Tomato Chicken: టేస్టీ టమాటా చికెన్ ఇలా చేస్తే.. సూపర్ అంతే!

| Edited By: Ravi Kiran

Jul 23, 2024 | 10:30 PM

చికెన్‌తో అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. చికెన్‌తో కర్రీలు, ఫ్రైలు, స్నాక్స్ ఇలా చాలా తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్‌ కర్రీలో టమాటా వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా చికెన్ అండ్ మటన్ కర్రీస్‌లో టమాటా వేయరు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్లీ ఇలాగే తయారు చేసుకుని తింటారు. ఇది చేయడం కూడా ఎంతో సింపుల్. ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు. మరి టమాటా చికెన్‌ని ఎలా తయారు..

Tomato Chicken: టేస్టీ టమాటా చికెన్ ఇలా చేస్తే.. సూపర్ అంతే!
Tamato Chicken
Follow us on

చికెన్‌తో అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. చికెన్‌తో కర్రీలు, ఫ్రైలు, స్నాక్స్ ఇలా చాలా తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్‌ కర్రీలో టమాటా వేసి వండితే చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా చికెన్ అండ్ మటన్ కర్రీస్‌లో టమాటా వేయరు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్లీ ఇలాగే తయారు చేసుకుని తింటారు. ఇది చేయడం కూడా ఎంతో సింపుల్. ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు. మరి టమాటా చికెన్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా చికెన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్ల పాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, ఆయిల్, జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి

టమాటా చికెన్‌ తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. నెక్ట్స్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు బాగా వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వేయించిన జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి, టమాట ముక్కలను మిక్సీ పట్టి.. చికెన్ మిశ్రమలో వేయాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్ వేసి మరో ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఉడికించాలి. చివరగా కొత్తి మీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, అన్నం, పులావ్ తో తినొచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది.