Paneer Tikki Chaat: ఎనర్జీని పన్నీర్ టిక్కీ చాట్.. ఈజీగా ఇంట్లోనే చేసేయవచ్చు..

|

Oct 04, 2024 | 5:49 PM

నవరాత్రుల్లో అందరూ ఉపవాసాలు ఉంటారు. కొందరు ఒక పూట భోజనం చేస్తే.. మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు వెల్లుల్లి, ఉల్లితో చేసిన ఆహారాలు తీసుకోరు. ఇలా వారి శక్తి కొద్దీ ఉపవాసాలు ఉంటారు. ఈ క్రమంలోనే వారిలో శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీరికి శక్తి కావాలి అంటే పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాంటి హై ప్రోటీన్, పోషకాలు ఉండే ఆహారాల్లో పన్నీర్ టిక్కీ చాట్ కూడా ఒకటి. ఈ రెసిపీతో రుచితో పాటు ఆరోగ్యం కూడా..

Paneer Tikki Chaat: ఎనర్జీని పన్నీర్ టిక్కీ చాట్.. ఈజీగా ఇంట్లోనే చేసేయవచ్చు..
Paneer Tikki Chaat
Follow us on

నవరాత్రుల్లో అందరూ ఉపవాసాలు ఉంటారు. కొందరు ఒక పూట భోజనం చేస్తే.. మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు వెల్లుల్లి, ఉల్లితో చేసిన ఆహారాలు తీసుకోరు. ఇలా వారి శక్తి కొద్దీ ఉపవాసాలు ఉంటారు. ఈ క్రమంలోనే వారిలో శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీరికి శక్తి కావాలి అంటే పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాంటి హై ప్రోటీన్, పోషకాలు ఉండే ఆహారాల్లో పన్నీర్ టిక్కీ చాట్ కూడా ఒకటి. ఈ రెసిపీతో రుచితో పాటు ఆరోగ్యం కూడా దొరుకుతుంది. మరి ఇంత ఎనర్జిటిక్ ఫుడ్ అయిన పన్నీర్ టిక్కీ చాట్‌ని ఎలా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పన్నీర్ టిక్కీ చాట్‌కి కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, ఉడకబెట్టిన ఆలు గడ్డలు, పచ్చి మిర్చి, పంచదార, పెరుగు, జీలకర్ర పొడి, దానిమ్మ గింజలు, మిరియాల పొడి, నల్ల ఉప్పు, వేయించిన వేరు శనగ, నెయ్యి లేదా బటర్.

పన్నీర్ టిక్కీ చాట్‌ తయారీ విధానం:

ముందుగా ఉడికించిన బంగాళ దుంపల్ని గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఇందులో పన్నీర్ చిన్న ముక్కలు లేదా తురుముకున్నా పర్వాలేదు, కొద్దిగా ఉప్పు వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితోనే చిన్న చిన్న టిక్కీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాని మీద నెయ్యి లేదా బటర్ వేసి.. రెండు వైపులా టిక్కీలను వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల మీద మీకు ఇష్టం అయితే గ్రీన్ చట్నీ వేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పెరుగును ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో పంచదార, జీలకర్ర పొడి, ఉప్పు, దానిమ్మ గింజలు, మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని గ్రీన్ చట్నీ మీద వేయాలి. దాని పైన వేరుశనగలు, సన్న కారం పూసతో గార్నిష్ చేసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీరు టిక్కీల చాట్ సిద్ధం. వీటిని అప్పటికప్పుడు చేసుకుని తినేయవచ్చు. చాలా తక్కువ సమయం పడుతుంది.