Mutton pickle: మటన్ పచ్చడిని ఇలా పెట్టండి.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది!

పచ్చళ్లలో నాన్ వెజ్ పచ్చళ్లు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి. చికెన్, మటన్, రోయ్యలు, పీతలు, ఫిష్ ఇలా చాలా రకాల పచ్చళ్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా చికెన్, మటన్ పచ్చళ్లనే తింటూంటారు. ఈ పచ్చళ్ల గురించి చెబుతూంటేనే నోరు ఊరి పోతుంది కదా. వేడి వేడి అన్నంలోకి వేసుకుని అబ్బా ఏముంది అనుకుంటారు. అయితే ఈ పచ్చళ్లను బయటే కొని తింటున్నారా.. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు. బయట ఎలా తయారు చేస్తారో..

Mutton pickle: మటన్ పచ్చడిని ఇలా పెట్టండి.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది!
Mutton Pickle 1
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:38 PM

పచ్చళ్లలో నాన్ వెజ్ పచ్చళ్లు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి. చికెన్, మటన్, రోయ్యలు, పీతలు, ఫిష్ ఇలా చాలా రకాల పచ్చళ్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా చికెన్, మటన్ పచ్చళ్లనే తింటూంటారు. ఈ పచ్చళ్ల గురించి చెబుతూంటేనే నోరు ఊరి పోతుంది కదా. వేడి వేడి అన్నంలోకి వేసుకుని అబ్బా ఏముంది అనుకుంటారు. అయితే ఈ పచ్చళ్లను బయటే కొని తింటున్నారా.. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు. బయట ఎలా తయారు చేస్తారో.. ఏ ఆయిల్ వాడతారో తెలీదు. అదే ఇంట్లో అయితే మన చేతులతో ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. నాన్ బెజ్ పచ్చళ్లల్లో మటన్ పచ్చడి కూడా ఒకటి. అయితే ఈ పచ్చళ్లు తయారు చేయం కష్టం అని అనుకుంటారు. నిజానికి కూరలు చేయడం కంటే ఇవి చేయడమే ఈజీ. కాస్త మెలకువలు పాటిస్తే సరి. మరి ఈ మటన్ పచ్చడిని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

మటన్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మ కాయలు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు.

ఇవి కూడా చదవండి

మటన్ పచ్చడి తయారీ విధానం:

ముందుగా మటన్ ని బాగా క్లీన్ చేసుకున్నాక.. కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ప్రెజర్ పోయాక నీళ్లను వడకట్టి మటన్ పీసులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండు మిర్చి వేసి ఒక్కొక్కటి వేయించు కోవాలి. ఇవి చల్లారాక.. మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. ఇవి సగం పొడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు కడాయిలో నూనె వేసి.. అందులో మటన్ వేసి మీడియం మంటపై వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక.. ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మటన్ వేసి కలపాలి. ఇప్పుడు సరిపడగా ఉప్పు, కారం వేసి మరోసారి కలుపు కోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన పొడి కూడా వేసి మరో రెండు, మూడు నిమిషాలు వేయించు కోవాలి.

ఈ పచ్చడి బాగా చల్లారాక నిమ్మ రంస వేసి పిండు కోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక రోజు లేదా మూడు రోజుల తర్వాత వేడి వేడి అన్నంలోకి ఒకసారి వేసుకుని టేస్ట్ చేయండి. సూపర్ టేస్ట్ తో ఘమఘుమలాడుతూ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు