Fitness Tips at Winter: వీటిని కనుక ఫాలో అయితే.. చలి కాలంలో కూడా ఫిట్ గా ఉంటారు!

వ్యాయామం చేయడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఏమీ ఉండవు. ప్రతి రోజూ వర్కౌట్స్ చేయడం వల్ల బాడీ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎలాంటి రోగాలు వచ్చినా శరీరం తట్టుకుని నిలబడెతుంది. అయితే చలి కాలంలో వర్కౌట్స్ చేయడానికి మాత్రం చాలా బద్ధకంగా ఉంది. చలి కారణంగా ఉదయం లేవడానికి బద్ధకిస్తారు. ఇతర పనులపై కూడా ఆసక్తి తక్కువగా ఉంటుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ శీతా కాలంలోనే వ్యాయామం ఖచ్చితంగా..

Fitness Tips at Winter: వీటిని కనుక ఫాలో అయితే.. చలి కాలంలో కూడా ఫిట్ గా ఉంటారు!
Fitness Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:34 PM

వ్యాయామం చేయడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఏమీ ఉండవు. ప్రతి రోజూ వర్కౌట్స్ చేయడం వల్ల బాడీ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎలాంటి రోగాలు వచ్చినా శరీరం తట్టుకుని నిలబడెతుంది. అయితే చలి కాలంలో వర్కౌట్స్ చేయడానికి మాత్రం చాలా బద్ధకంగా ఉంది. చలి కారణంగా ఉదయం లేవడానికి బద్ధకిస్తారు. ఇతర పనులపై కూడా ఆసక్తి తక్కువగా ఉంటుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ శీతా కాలంలోనే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే బాడీ ఫిట్ గా ఉంటుంది. ఈ సీజన్ లో ఎక్సర్ సైజ్ లు చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం.

వాకింగ్ లేదా జాగింగ్:

వాకింగ్, జాగింగ్ లాంటివి ఏ సీజన్ లో అయినా చేయవచ్చు. ఉదయం లేదా సాయత్రం కూడా వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చల్లని వాతావరణంలో వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల కేలరీలు అనేవి ఎక్కువగా ఖర్చు అవుతాయి. అదే విధంగా ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఏకాగ్రత, ఒత్తిడి తగ్గుతాయి. ఉదయం లేవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

వాటర్:

చాలా మంది చలి కాలం రాగానే వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు. వాతావరణం చల్లగా ఉందని లేదా యూరిన్ ఫ్లో ఉంటుందని తక్కువగా తాగుతారు. కానీ నిజం చెప్పాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా నీరు తాగాలి. వింటర్ సీజన్ రాగానే చర్మం తేమ కోల్పోయి.. పొడి బారడం, గీతలు రావడం చూస్తూంటాం. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. నీరు ఎక్కువగా తాగాలి. అలాగే శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.

బట్టలు:

సాధారణంగా చలి కారణంగా బాడీలో రక్త ప్రసరణ అనేది తగ్గి పోతుంది. అలా కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంటే బట్టలు వేసుకోవాలి. అప్పుడే శరీరం చల్ల బడకుండా ఉంటుంది.

లంచ్ బ్రేక్ లో ఎక్సర్ సైజ్:

మరీ విపరీతంగా చలి ఉన్నప్పుడు ఉదయం ఎక్సర్ సైజ్ చేయాలంటే కష్టం. అలాంటప్పుడు లంచ్ బ్రేక్ లో వ్యాయామం, వాకింగ్, స్ట్రెచెస్, ధ్యానం వంటివి చేయవచ్చు. దీని వల్ల బాడీలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అలాగే ఒత్తిడి తగ్గి, యాక్టీవ్ గా మారతారు.

స్ట్రెచెస్:

చలి కాలంలో ముఖ్యంగా స్ట్రెచెస్ చేయాలి. అప్పుడే బాడీ వేడిగా మారి.. రక్త ప్రసరణ అనేది మెరుగ్గా ఉంటుంది. అదే విధంగా కండరాల పని తీరు కూడా చురుగ్గా ఉంటాయి. స్ట్రెచెస్ వల్ల ఒత్తిడి, మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా