Garlic for Belly Fat: వెల్లుల్లితో ఇవి కలిపి తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించేయవచ్చు!

మనం రోజువారీ తీసుకునే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెల్లుల్లితో చాలా అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడంతో పొట్ట కూడా పెరిగి పోతుంది. దీంతో నలుగురిలో తిరిగేందుకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే ఈ పొట్టను కరిగించడంలో..

Garlic for Belly Fat: వెల్లుల్లితో ఇవి కలిపి తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించేయవచ్చు!
Garlic
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 9:31 PM

మనం రోజువారీ తీసుకునే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెల్లుల్లితో చాలా అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో వెల్లుల్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడంతో పొట్ట కూడా పెరిగి పోతుంది. దీంతో నలుగురిలో తిరిగేందుకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే ఈ పొట్టను కరిగించడంలో వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుంది. మీ డైట్ లో వెల్లుల్లి చేర్చుకుంటే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని, అలాగే ఫిట్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి – వేడి నీళ్లు:

వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఉంది. ఇది బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి పని చేస్తుంది. పొట్టు తీసేసిన ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుని దాన్ని దంచాలి. అలా దంచిన వెల్లుల్లి గుజ్జును.. ఓ గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో బాగా కలిపాలి. ఇలా రెడీ అయిన డ్రింక్ ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి – నిమ్మ రసం:

పొట్టు తీసేసని ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుని దంచాలి. ఇప్పుడు ఓ గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లు తీసుకుని అందులో నిమ్మ కాయ రసం, దంచిన వెల్లుల్లి గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా పరగడుపున తాగితే.. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నిమ్మ కాయలోని విటమిన్ సి కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఎఫెక్టీవ్ గా వర్క్ చేస్తుంది.

వెల్లుల్లి – తేనె:

పచ్చి వెల్లుల్లి టేస్ట్ నచ్చని వారు ఇలా ట్రై చేయండి. ఓ గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్ తేనె, దంచిన వెల్లుల్లిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింక్ తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.

వెల్లుల్లి – గ్రీన్ టీ:

బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ తాగుతారు. ఈ గ్రీన్ టీలో దంచిన వెల్లుల్లిని యాడ్ చేసి తాగితే.. శక్తివంతమైన డ్రింక్ గా తయారవుతుంది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. జీర్ణ క్రియని వేగం వతంగా చేస్తాయి. ఫలితంగా బాడీలోని కొవ్వు ఫాస్ట్ గా కరుగుతుంది.

అదే విధంగా ఈ టిప్స్ పాటిస్తూ.. వ్యాయామం చేస్తూ.. మంచి డైట్ మెయింటైన్ చేస్తే నెల రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.