Mutton Keema Recipe: మటన్ ఖీమాను ఈ స్టైల్ లో వండండి.. అదిరిపోతుంది అంతే!

నాన్ వెజ్ లో అందరూ తీసుకునే వాటిల్లో మటన్ ఖీమా కూడా ఒకటి. మటన్ కీమాతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. స్నాక్స్, బిర్యానీ, కర్రీస్ ఇలా చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. నార్మల్ గా ఇంట్లో చేసుకునే ఖీమా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్, చికెన్, పూరీ, చపాతీ, అన్నం ఇలా వేటితో తిన్నా రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. అయితే సాధారణంగా ఉండే.. మటన్ ఖీమాకి బదులు.. ఇప్పుడు తయారు చేసుకునే కర్రీ ఇంకా టేస్టీగా..

Mutton Keema Recipe: మటన్ ఖీమాను ఈ స్టైల్ లో వండండి.. అదిరిపోతుంది అంతే!
Mutton Keema Recipe

Edited By:

Updated on: Dec 31, 2023 | 4:45 PM

నాన్ వెజ్ లో అందరూ తీసుకునే వాటిల్లో మటన్ ఖీమా కూడా ఒకటి. మటన్ కీమాతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. స్నాక్స్, బిర్యానీ, కర్రీస్ ఇలా చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. నార్మల్ గా ఇంట్లో చేసుకునే ఖీమా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్, చికెన్, పూరీ, చపాతీ, అన్నం ఇలా వేటితో తిన్నా రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. అయితే సాధారణంగా ఉండే.. మటన్ ఖీమాకి బదులు.. ఇప్పుడు తయారు చేసుకునే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ మటన్ ఖీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ ఖీమా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

మటన్ ఖీమా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కరివేపాకు, పుదీనా, ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా.

మటన్ ఖీమా కర్రీ తయారు చేయు విధానం:

ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేగా.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసుకుని కలపాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలపాలి. ఇలా ఖీమాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఓ ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత.. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కాసేపు వేయించిన తర్వాత.. నీళ్లు పోసి మూత పెట్టి.. ఒక్క ఉడుకు రానివ్వాలి.

ఇవి కూడా చదవండి

ఆ నెక్ట్ గరం మసాలా, పుదీనా, కొత్తి మీర వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి.. ఓ ఐదు విజిల్స్ వచ్చేంత వరకు రానిచ్చి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి తగ్గాక ఒకసారి కుక్కర్ మూత తీసి చూసుకోవాలి. నీళ్లు ఉంటే కాసేపు ఉడికించి దించేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. మటన్ ఖీమా సిద్ధం. ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ ఇదే స్టైల్ లో వండుకుని తింటారు.