Mutton Fry: మటన్ ఫ్రైని ఇంట్లో ఇలా తయారు చేస్తే.. మళ్లీ మళ్లీ అలాగే చేయమంటారు!

| Edited By: Ram Naramaneni

Dec 24, 2023 | 8:38 PM

మటన్ తో అనేక రకాలైన వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మటన్ బిర్యానీ తిని ఉంటారు. అలాగే రెస్టారెంట్లు, హోటల్స్ కు వెళ్లినప్పుడు అందరూ ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే ఐటెమ్స్ లో మటన్ ఫ్రై కూడా ఒకటి. రెస్టారెంట్లలో మెత్తగా.. టేస్టీగా తయారు చేస్తారు మటన్ ఫ్రై. అదే రుచితో మనం కూడా ఇంట్లో మటన్ ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా సమయం పట్టినా కూడా.. టేస్ట్ మాత్రం దీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక్కాసరి ఇంట్లో చేస్తే మళ్లీ మళ్లీ అలాగే చేయమంటారు. ఇది పులావ్, అన్నం, రోటీల్లోకి చాలా బావుంటుంది. మరి ఈ మటన్..

Mutton Fry: మటన్ ఫ్రైని ఇంట్లో ఇలా తయారు చేస్తే.. మళ్లీ మళ్లీ అలాగే చేయమంటారు!
Mutton Fry
Follow us on

మటన్ తో అనేక రకాలైన వంటలను తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మటన్ బిర్యానీ తిని ఉంటారు. అలాగే రెస్టారెంట్లు, హోటల్స్ కు వెళ్లినప్పుడు అందరూ ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే ఐటెమ్స్ లో మటన్ ఫ్రై కూడా ఒకటి. రెస్టారెంట్లలో మెత్తగా.. టేస్టీగా తయారు చేస్తారు మటన్ ఫ్రై. అదే రుచితో మనం కూడా ఇంట్లో మటన్ ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా సమయం పట్టినా కూడా.. టేస్ట్ మాత్రం దీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక్కాసరి ఇంట్లో చేస్తే మళ్లీ మళ్లీ అలాగే చేయమంటారు. ఇది పులావ్, అన్నం, రోటీల్లోకి చాలా బావుంటుంది. మరి ఈ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తోరో ఇప్పుడు చూద్దాం.

మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

మటన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మటన్ మసాలా, కసూరి మెంతి, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పెరుగు, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి, కొత్తి మీర, ఆయిల్.

మటన్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా కుక్కర్ లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. అల్లం పేస్ట్ వేసి వేయించాక.. మటన్ వేయాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేయాలి. ఆ తర్వాత నీళ్లు పోసి.. మటన్ మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత మందంగా ఉన్న కడాయి తీసుకుని.. అందులో ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కాక.. జీడిపప్పు ఎర్రగా వేయించి.. పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాక.. ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు వేసి వేయించు కోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం వేసి.. అందులో ఉండే నీరంతా పోయేదాకా ఉడికించు కోవాలి.

ఇవి కూడా చదవండి

ఆయిల్ పైకి తేలాక.. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించు కోవాలి. రెండు నిమిషాల వేయించాక.. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మటన్ మసాలా పొడి కూడా వేసి వేయించాలి. ఇవి కాసేపు వేగాక.. కసూరి మేతి, కొత్తి మీర వేసి కలుపుకుని.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.