Mixed Vegetable Pakora: మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ.. టేస్ట్ వేరే లెవల్..

| Edited By: Ravi Kiran

Feb 11, 2025 | 9:39 PM

మిక్సెడ్ వెజిటేబుల్స్‌తో చేసే ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. కూరగాయలు ఉంటాయి కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేని పిల్లలకు ఇలా చేసి పెట్టవచ్చు. దీని వల్ల పోషకాలు కూడా అందుతాయి. అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా చూసుకోండి..

Mixed Vegetable Pakora: మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ.. టేస్ట్ వేరే లెవల్..
Mixed Vegetable Pakora
Follow us on

పకోడీలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాయంత్రం అయ్యిందంటే స్నాక్స్ రూపంలో పకోడీలు కడుపులోకి వెళ్తూ ఉంటాయి. పకోడీల్లో చాల రకాలు చూశాము. కానీ అన్ని కూరగాయలు కలిపి చేసే పకోడీ ఎప్పుడైనా మీరు రుచి చూశారా.. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎంతో అన్ని కూరగాయలు తిన్నట్టు ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. మరి మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ ఎలా తయారు చేస్తారు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా తక్కువ సమయంలో ఈ పకోడీ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూరగాయలు ఉన్నప్పుడు ఇలా పకోడీ చేసుకోవచ్చు.

మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:

క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పాలకూర, అల్లం ముక్కలు, గరం మసాలా, వాము, జీలకర్ర, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, శనగ పిండి, బియ్యం పిండి, ఆయిల్.

మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం:

ముందుగా అన్నీ కలిపేందుకు వీలుగా ఉండే ఓ గిన్నె తీసుకోండి. ఇందులో శనగ పిండి, బియ్యం పిండి, సాల్ట్ కొద్దిగా వేసి కలకండి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, పాలకూర, అల్లం ముక్కలు, గరం మసాలా, కారం, పసుపు, జీలకర్ర, కొద్దిగా వాము, కొత్తిమీర వేసి వాటర్ సరిపడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఆయిల్ వేడెక్కగానే ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీల మాదిరగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వేయించుకున్నాక టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. అంతే ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే మిక్సెడ్ వెజిటేబుల్ పకోడీ సిద్ధం. దీన్ని పుదీనా చట్నీ, టమాటా సాస్ లేదా నేరుగా తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.