గారెలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అందులోనూ ఆంధ్ర ప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో ఈ గారెలు మరింత ఫేమస్. ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా మొదటగా చేసేవి ఈ గారెలు. ఇవి వాళ్ల మర్యాదకు గుర్తుగా చేస్తారు. కోడి కూర -గారెలు కాంబినేషన్ వేరే లెవల్ అంతే. ఈ గారెలను మినపప్పుతో తయారు చేస్తారు. కానీ ఈ పప్పు నానబెట్టి, రుబ్బి చేసే వరకు చాలా సమయం పడుతుంది. ఇప్పటికే మనం ఇన్‌స్టెంట్‌గా వడలను ఎలా తయారు చేసుకోవచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు మరమరాలతో ఇన్‌స్టెంట్‌గా గారెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇవి ఎంతో సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఉంటాయి. కేవలం ఓ 20 నిమిషాల్లోనే గారెలు సిద్ధం అవుతాయి. ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటాయి. వెరైటీగా తయారు చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీ బెస్ట్. మరి మరమరాలతో గారెలు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మరమరాలు, పెరుగు, బియ్యం పిండి, కొత్తి మీర, కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, ఉప్పు, ఆయిల్.
ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందు మరమరాలు తీసుకుని అందులో వాటర్ వేసి శుభ్రంగా కడిగి, బాగా పిండి.. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు, బియ్యం పిండి, కొత్తి మీర, కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, ఉప్పు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోకి అవసరం అయితేనే వాటర్ వేయండి. లేదంటే అవసరం లేదు. ఈ పిండి గారెల పిండిలా ముద్దగా ఉండాలి. అప్పుడే గారెలు చక్కగా వస్తాయి.
ఇప్పుడ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక.. ఈ పిండితో వడలు వేసుకోండి. రెండు వైపులా ఎర్రగా వేయించుకున్నా ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే మరమరాల గారెలు సిద్ధం. ఈ గారెలు టమాటా చట్నీ, పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.