కోడి గుడ్డ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ గుడ్డు తినడం ఎంతో మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. కోడి గుడ్లతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. గుడ్డుతో చేసే ఏ వంటలు అయినా రుచిగానే ఉంటాయి. ఇప్పటికే గుడ్డుతో చేసే ఎన్నో వంటలు తెలుసుకున్నాం. తాజాగా మరో కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే శనగపప్పు కోడి గుడ్డు కర్రీ. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పులావ్‌లో తిన్నా టేస్ట్ బాగుంటంది. ఒక్కాసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇది వరకు ఎక్కువగా శనగపప్పు నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా తింటున్నారు. శనగ పప్పు వేయడం వల్ల కూరలకు మంచి రుచి వస్తుంది. మరి ఈ కోడి గుడ్డు శనగ పప్పు కర్రీని ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడి గుడ్డు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్.
ముందుగా గుడ్లను ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చనగ పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. ఉల్లిపాయలు, పచ్చి వేసి వేయించు కోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత శనగ పప్పు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాక.. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ ఐదు నిమిషాలు వేయించి.. తర్వాత నీళ్లు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు దగ్గర పడుతున్నప్పుడు.. కోడి గుడ్లు గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే శనగపప్పు గుడ్ల కర్రీ సిద్ధం. ఈ కర్రీ పుల్కా, చపాతీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి, వెజ్ పులావ్‌లోకి కూడా బాగుంటుంది.