Chicken Fried Rice: నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!

|

Dec 29, 2024 | 7:21 PM

ఈ వింటర్ సీజన్‌లో వేడి వేడిగా బయట తినాలనిపిస్తూ ఉంటుంది. బయట చేసే ఫుడ్సే మనం ఇంట్లో సింపుల్‌గానే తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది చికెన్ ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటారు. దీన్ని మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేయవచ్చు. ఇంట్లో అయితే మరింత ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు..

Chicken Fried Rice: నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
Chicken Fried Rice
Follow us on

ఇంట్లో ఎన్ని రకాల వెరైటీలు చేసినా.. బయట తినాలని పెద్దవాళ్లకైనా, చిన్న వాళ్లకైనా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒక సారి అయితే పర్వాలేదు. కానీ ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడక తప్పదు. అందులో ఈ వింటర్ సీజన్‌లో వేడి వేడిగా బయట తినాలనిపిస్తూ ఉంటుంది. బయట చేసే ఫుడ్సే మనం ఇంట్లో సింపుల్‌గానే తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది చికెన్ ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటారు. దీన్ని మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేయవచ్చు. ఇంట్లో అయితే మరింత ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. సండే సమయంలో స్పెషల్‌గా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ వంటివి చేస్తే.. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

చికెన్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఉడికించిన అన్నం, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్, వెల్లుల్లి, సోయా సాస్, వెనిగర్, కొత్తిమీర, కోడిగుడ్లు.

చికెన్ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి వేయించి పెట్టుకోండి. చికెన్‌ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేయడం కంటే.. వేయించడం సింపుల్. అలాగే అన్నాన్ని కూడా ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసి.. గుడ్లు చితక్కొట్టి వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ పచ్చి మిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, క్యాబేజీ తరుగు ఒక దాన్ని తర్వాత వేసి ఓ ఐదు నిమిషాలు ఫ్రై చేయండి.

ఇవి కూడా చదవండి

ఇలా మనకు నచ్చినవి వేసుకోవచ్చు. లేదంటే మానేయవచ్చు. ఆ తర్వాత ఇందులో ఫ్రై చేసి చికెన్ ముక్కలు, ఫ్రై చేసిన గుడ్డును వేయండి. ఇలా పదినిమిషాలు వేయించిన తర్వాత వీటిల్లోనే కారం, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ కూడా వేసి ఓ పది నిమిషాలు కలపండి. ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి అంతా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. ఇలా చేసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది.