చికెన్ కట్ లెట్స్ ఒక్కసారైనా తినే ఉంటారు. ఎక్కువగా వీటిని స్నాక్స్‌గా తీసుకుంటారు. రెస్టారెంట్స్‌లో వీటిని చేస్తూ ఉంటారు. అస్తమానూ రెస్టారెంట్స్‌కి వెళ్లి తినాలంటే కష్టంగా ఉంటుంది. వీటిని మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్స్‌లో, కేఫేల్లో తిన్న రుచిగా వస్తాయి. మొదటి సారి చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ చికెన్ కట్ లెట్స్‌ని మనం ఇంట్లో చేసేద్దాం. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్న సమయంలో వీటిని తయారు చేసుకుని తినవచ్చు. మరి ఈ చికెన్ కట్ లెట్స్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ కీమా, ఆలు గడ్డలు, ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, బ్రెడ్ క్రంబ్స్, గుడ్డు, ఆయిల్.
చికెన్ కీమా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీన్ని ఉడికించి తీసుకోవచ్చు లేదా నేరుగా తీసుకోవచ్చు. ఒక గిన్నెలోకి చికెన్ కీమా తీసుకుని అందులో ఉడికించిన బంగాళ దుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి కొద్దిగా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ ముద్దలా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఎగ్ చితక్కొటి వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. మరో ప్లేట్‌లో బ్రెండ్ క్రంబ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమంతో మీకు నచ్చిన షేపులో కట్ లెట్స్ తయారు చేసుకోవాలి. ఈ కట్ లెట్స్‌ని ముందు ఎగ్ మిశ్రమంలో ముంచి ఆ తర్వాత బ్రెండ్ క్రంబ్స్‌లో దొర్లించాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక ఆయిల్‌లో వేసి రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ కట్ లెట్స్ సిద్ధం.