Bread Uthappam: వైరటీగా తినాలి అనుకుంటే.. బ్రెడ్ ఊతప్పం ట్రై చేయండి..

| Edited By: Shaik Madar Saheb

Dec 08, 2024 | 11:00 PM

ఇడ్లీ పిండితో బ్రెడ్ ఊతప్పం తినే ఉంటారు. కానీ బ్రెడ్‌తో తిని ఉండరు.. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా అప్పటికప్పుడు తాయరు చేసుకోవచ్చు..

Bread Uthappam: వైరటీగా తినాలి అనుకుంటే.. బ్రెడ్ ఊతప్పం ట్రై చేయండి..
Bread Uthappam
Follow us on

ఎప్పుడూ ఒకటే ఐటెమ్స్ తినీ తినీ చాలా మందికి బోర్ కొడుతూ ఉంటుంది. వెరైటీగా కావాలి.. తినాలి అనుకుంటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్‌లో అప్పటికప్పుడు వెరైటీగా బ్రెడ్ ఊతప్పం తాయరు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో బ్రెడ్ ఊతప్పం తినే ఉంటారు. కానీ బ్రెడ్‌తో తిని ఉండరు.. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వెరైటీగా పెట్టాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. మరి ఈ బ్రెడ్ ఊతప్పం ఎలా తయారు చేస్తారు? ఈ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

బ్రెడ్ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, అటుకులు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, ఆయిల్ లేదా నెయ్యి.

బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం:

ముందుగా అటుకులను ఓ పది నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఈ ఊతప్పం తయారు చేయడం చాలా సింపుల్. ముందుగా మీ క్వాంటిటీకి కావాల్సినంత బ్రెడ్స్ తీసుకోండి. బ్రెడ్ అంచులు కట్ చేసి.. ముందు బ్రెడ్ ముక్కలు తీసుకోండి. వీటిని ఇప్పుడు పొడిలా చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కట్ చేసిన నానాబెట్టిన అటుకులు, ఉల్లి, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇవి కూడా చదవండి

కావాలి అనుకుంటే కొద్ది నీరు వేసి కలుపుకోవచ్చు. అన్నీ బాగా కలుకుపి ఓ ఐదు నిమిషాలు పక్కకు వదిలేయండి. ఆ తర్వాత ఒక పెనం తీసుకుని నెయ్యి లేదా నూనె వేయండి. పాన్ వేడెక్కగానే.. గరిటెతో కాకుండా.. చేతితో ఊతప్పంలా వేయండి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే డ్రెడ్ ఊతప్పం సిద్దం. ఇది సాఫ్ట్‌గా ఉంటాయి. పిల్లలకు కూడా నచ్చుతాయి.