Bread Masala: ఈవినింగ్‌కి బెస్ట్ స్నాక్ బ్రెడ్ మసాలా.. ఆహా అనాల్సిందే!

|

Aug 30, 2024 | 8:26 PM

స్కూల్, కాలేజీ, ఉద్యోగాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. చిరు ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది బయట తింటూ ఉంటారు. కానీ బయట ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. ఒక్క పది నిమిషాలు సమయం కేటాయిస్తే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ సమయంలో, టేస్టీగా వచ్చే ఐటెమ్స్‌లో బ్రెడ్ మసాలా రెసిపీ కూడా ఒకటి. ఈ రెసిపీని బ్రెడ్‌తో తయారు చేస్తూ ఉంటారు. ఇది ఫాస్ట్ ఫుడ్ తిన్నట్లు కూడా..

Bread Masala: ఈవినింగ్‌కి బెస్ట్ స్నాక్ బ్రెడ్ మసాలా.. ఆహా అనాల్సిందే!
Bread Masala
Follow us on

స్కూల్, కాలేజీ, ఉద్యోగాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. చిరు ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది బయట తింటూ ఉంటారు. కానీ బయట ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. ఒక్క పది నిమిషాలు సమయం కేటాయిస్తే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ సమయంలో, టేస్టీగా వచ్చే ఐటెమ్స్‌లో బ్రెడ్ మసాలా రెసిపీ కూడా ఒకటి. ఈ రెసిపీని బ్రెడ్‌తో తయారు చేస్తూ ఉంటారు. ఇది ఫాస్ట్ ఫుడ్ తిన్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ రెసిపీ చాలా తక్కువ సమయంలోనే.. ఈజీగా అయిపోతుంది. తక్కువ పదార్థాలతోనే చేయవచ్చు. వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే ఆహా అంటారు. మరి ఈ బ్రెడ్ మసాలా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, టమాటా, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, కసూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఆయిల్ లేదా బటర్.

బ్రెడ్ మసాలా తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ తీసుకుని అంచులు కట్ చేయాలి. ఈ మసాలాకు బ్రెడ్ ముక్కలు కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ లేదా బటర్ వేసుకుని పెట్టుకోవాలి. బటర్ వేసుకుంటా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాక.. ఆ తర్వాత అల్లం వెల్లులి ముద్ద వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ టమాటాలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించు కోవాలి. కావాలి అంటే క్యారెట్, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కలపాలి. ఇవన్నీ వేగాక ఇప్పుడు కొత్తి మీర, కసూరి మేతీ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. బ్రెడ్ ముక్కలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చివరగా నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ మసాలా సిద్ధం.