Rose Milk: రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి..

|

Jul 09, 2024 | 6:21 PM

రోజ్ మిల్క్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాజమండ్రి. ఈ రోజ్ మిల్క్ రాజమండ్రిలో అంత ఫేమస్ మరి. ఎవరైనా రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ ఖచ్చితంగా తాగాలి. రాజమండ్రి రోజ్‌ మిల్క్‌కు ఎంతో ప్రాచూర్యం ఉంది. రోజ్ మిల్క్‌ని ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ మాత్రం వేరే. ఈ రోజ్ మిల్క్ కోసం ముందు సిరప్ తయారు చేసుకోవాలి. దీంతోనే మనం రోజ్ మిల్క్ తయారు చేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీ. అంతే కాకుండా ఆరోగ్యం..

Rose Milk: రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి..
Rose Milk
Follow us on

రోజ్ మిల్క్ అంటే ముందుగా గుర్తొచ్చేది రాజమండ్రి. ఈ రోజ్ మిల్క్ రాజమండ్రిలో అంత ఫేమస్ మరి. ఎవరైనా రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ ఖచ్చితంగా తాగాలి. రాజమండ్రి రోజ్‌ మిల్క్‌కు ఎంతో ప్రాచూర్యం ఉంది. రోజ్ మిల్క్‌ని ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ మాత్రం వేరే. ఈ రోజ్ మిల్క్ కోసం ముందు సిరప్ తయారు చేసుకోవాలి. దీంతోనే మనం రోజ్ మిల్క్ తయారు చేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీ. అంతే కాకుండా ఆరోగ్యం కూడా. మరి ఇంత ఫేమస్ అయినా రాజమండ్రి రోజ్ మిల్క్‌ని మనం ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. సేమ్ రాజమండ్రి రోజ్ మిల్క్ తాగినట్టు ఉంటుంది. మరి ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

రాజమండ్రి రోజ్ మిల్క్‌కి కావాల్సిన పదార్థాలు:

గులాబీ రేకులు, పంచదార, పాలు, బీట్ రూట్ రసం, బాదం పప్పు, పాల మీద మీగడ.

రాజమండ్రి ఫేమస్ తయారీ విధానం:

రోజ్ మిల్క్ తయారు చేసుకోవడానికి ముందుగా సిరప్ తయారు చేసుకోవాలి. కాబట్టి గులాబీ రేకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత.. గులాబీ రేకులను ముందు రోజు రాత్రి నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం ఇందులో బీట్రూట్ రసం వేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో పంచదార వేయాలి. ఆ తర్వాత పంచదారను నీటితో పాటు గులాబీ రేకులను కూడా వేసి చిన్న మంట మీద మరిగించు కోవాలి. ఇప్పుడు ఇదంతా పాకంలా వస్తుంది. ఈ సమయంలో దించేసి.. చల్లార్చాలి. ఇప్పుడు పాలను మరగపెట్టి.. గోరు వెచ్చగా చల్లార్చాలి. ఆ తర్వాత పాలను ఫ్రిజ్‌లో పెట్టి గడ్డి పడేలా చేయాలి. డీప్ ఫ్రిజ్‌లో పెడితే చాలు.

ఇవి కూడా చదవండి

పాలు గట్టిగా అయ్యాక తీసి మిక్సీలో వేసి తిప్పాలి. ఆ తర్వాత గ్లాసులో వేయాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్టుకు తగినట్టు రోజ్ సిరప్ వేసుకోవాలి. పై నుంచి బాదం పప్పులు, పాల మీద మీగడ వేసుకుని తాగితే అంతే ఎంతో రుచిగా ఉండే రాజమండ్రి రోజ్ మిల్క్ తయారు. కావాలి అనుకునేవారు రోజ్ మిల్క్, సేమియా, చియా సీడ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ మిశ్రమాన్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు రోజ్ మిల్క్ తయారు చేసుకోవచ్చు.