Mutton Paya Soup: మటన్ పాయ సూప్.. ఎన్ని బెనిఫిట్స్ అంటే.. ఇలా చేయాలి

|

Aug 01, 2024 | 2:04 PM

మటన్ పాయ అంటే తెలీనోళ్లు ఎవరూ ఉండరు. హైదరాబాద్ వచ్చారంటే మటన్ పాయ తిని వెళ్లాల్సిందే. ఇది కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఈ మటన్ పాయా తింటే చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని ఎలా తిన్నా పోషకాలు మాత్రం సమృద్ధిగా అందుతాయి. అయితే ఈ మటన్ పాయా చేయడం..

Mutton Paya Soup: మటన్ పాయ సూప్.. ఎన్ని బెనిఫిట్స్ అంటే.. ఇలా చేయాలి
Mutton Paya
Follow us on

మటన్ పాయ అంటే తెలీనోళ్లు ఎవరూ ఉండరు. హైదరాబాద్ వచ్చారంటే మటన్ పాయ తిని వెళ్లాల్సిందే. ఇది కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఈ మటన్ పాయా తింటే చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని ఎలా తిన్నా పోషకాలు మాత్రం సమృద్ధిగా అందుతాయి. అయితే ఈ మటన్ పాయా చేయడం చాలా మందికి తెలీదు. ఎప్పుడూ బయటకు వెళ్లి తినాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈజీ ప్రాసెస్‌లో మటన పాయా సూప్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ పాయా సూప్‌కి కావాల్సిన పదార్థాలు:

గొర్రె కాళ్లు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నెయ్యి, మిరియాలు, యాలకులు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి , టమాటాలు, కొత్తి మీర, కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, ఎండు మిర్చి.

మటన్ పాయా సూప్‌ తయారీ విధానం:

ముందుగా శనగ పప్పును వేయించి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత తురిమిన కొబ్బరి, నీరు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని అందులో గొర్రెల కాళ్లు, పసుపు, యాలకులు, ఉప్పు, ఎండు మిర్చి, మిరియాలు వేసి నీళ్లు వేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు సూప్‌లో వేసేందుకు మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించు కోవాలి. అవి రంగు మారేవరకు ఉంచాలి. రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత టమాటాలు, కారం వేసి మరి కాసేపు వేయించి.. ఇప్పుడు ముందుగా వేయించిన కొబ్బరి తురుము మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఓ పది నిమిషాలు పాటు ఉడికించి.. కుక్కర్ తెరిచి స్టవ్ మళ్లీ వెలిగించాలి. ఇప్పుడు పాయా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి.. చిక్కగా కావాలి అనుకుంటే.. చిక్కగా ఉంచుకోవాలి. దించే ముందు.. గరం మసాలా, కొత్తి మీర వేసి బాగా కలిపి దించేయడమే. ఈ పాయా సూప్‌ని వేటితో తిన్నా.. చాలా రుచిగా ఉండేది.