
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నల్లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. జొన్నలతో కేవలం రొట్టెలే కాకుండా.. వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. దీంతో తయారు చేసుకోదగిన వాటిల్లో జొన్న దోశ కూడా ఒకటి. ఇవి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఈ దోశకు ముందుగా ప్రిపరేషన్ అవసరం లేదు. ఇన్‌స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకునేవారు ఇలా వెరైటీగా ట్రై చేయవచ్చు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్నల దోశ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పిండి, బియ్యం పిండి, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కొత్తి మీర, ఉప్పు, ఆయిల్.
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులో జొన్న పిండి, బియ్యం పిండి, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కొత్తి మీర, ఉప్పు, నీళ్లు వేసి.. దోశ బ్యాటర్‌లా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. పెనం వేడి చేయాలి. ఈ దోశలు సాధారణ దోశల్లా రావు. రవ్వ దోశ మాదిరిగా వేయాలి.
దోశ తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసి.. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న దోశ తయారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. అప్పటికప్పుడు పది నిమిషాల్లో దోశలు సిద్ధం అవుతాయి. జొన్నలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.