Coconut Laddu: నోట్లో కరిగిపోయే కొబ్బరి లడ్డూలు.. టేస్ట్ వేరే లెవెల్..

| Edited By: Shaik Madar Saheb

Jul 30, 2024 | 7:53 PM

పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చి కొబ్బరిలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. చర్మానికి, జుట్టుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి కొబ్బరితో ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుంది. పచ్చి కొబ్బరిని అప్పుడప్పుడూ మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. కేరళలో ఎక్కువగా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె..

Coconut Laddu: నోట్లో కరిగిపోయే కొబ్బరి లడ్డూలు.. టేస్ట్ వేరే లెవెల్..
Coconut Laddu
Follow us on

పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చి కొబ్బరిలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. చర్మానికి, జుట్టుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి కొబ్బరితో ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుంది. పచ్చి కొబ్బరిని అప్పుడప్పుడూ మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. కేరళలో ఎక్కువగా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే వారు అంత అందంగా ఉంటారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి కొబ్బరితో తయారు చేసే వాటిల్లో కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. ఇవి చాలా ఫాస్ట్‌గా అయిపోవడమే కాకుండా.. చాలా రుచిగా కూడా ఉంటాయి. మరి అవి ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పచ్చి కొబ్బరి లడ్డూకి కావాల్సిన పదార్థాలు:

పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, పంచదార, పాలు, యాలకుల పొడి, డ్రై ఫ్రైట్స్.

పచ్చి కొబ్బరి లడ్డూ తయారీ విధానం:

ముందుగా ఒక కడాయిలో పచ్చి కొబ్బరి తురుము వేసి చిన్న మంటపై ఓ పది నిమిషాలు వేయించండి. అయితే ఈ తురుము అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలి. పొడి పొడిగా ఈ తురుము అవ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసి మరి కాసేపు కలుపుకోవాలి. నెయ్యిలో తురుము వేగిన తర్వాత.. కాచి చల్లార్చిన పాలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పంచదారను కూడా వేసి.. ఇది పూర్తిగా కరిగే వరకు ఓ పది నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ నెక్ట్స్ యాలకుల పొడి వేసి మారికాసేపు కలపాలి.

ఇవి కూడా చదవండి

ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో కావాలంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేయాలని. ఈ లడ్డూలు చుట్టేటప్పుడు వీటిపై పచ్చి కొబ్బరి తురుము చల్లి గార్నిష్ చేస్తే.. చూడటానికి కూడా ఆకర్షణగా ఉంటాయి. వీటికి గాలి తగలకుండా నిల్వ ఉంచితే మూడు రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.