Egg Pulao: ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఎగ్ పులా చేసుకోండి..

గుడ్లు అనేవి నిత్యవసర వస్తువు. కోడి గుడ్లతో చేయలేని వెరైటీ ఏమీ ఉండవు. గుడ్లతో అనేక రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. కర్రీస్, రైస్ ఐటెమ్స్, స్నాక్స్, పచ్చళ్లు ఇలా ఒక్కటేంటి.. అనేక రకాలు తయారు చేసుకోవచ్చు. గుడ్డు ప్రతి రోజూ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైనా నోరు చప్పగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే.. కోడి గుడ్లతోనే వెరైటీలు తయారు చేసుకుంటారు. ఇలా ఇప్పుడు సింపుల్‌గా ఎగ్ పులావ్ తయారు చేసుకోండి. ఇది నోటికి రుచిగా..

Egg Pulao: ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఎగ్ పులా చేసుకోండి..
Egg Pulao

Edited By:

Updated on: Jul 14, 2024 | 11:30 PM

గుడ్లు అనేవి నిత్యవసర వస్తువు. కోడి గుడ్లతో చేయలేని వెరైటీ ఏమీ ఉండవు. గుడ్లతో అనేక రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. కర్రీస్, రైస్ ఐటెమ్స్, స్నాక్స్, పచ్చళ్లు ఇలా ఒక్కటేంటి.. అనేక రకాలు తయారు చేసుకోవచ్చు. గుడ్డు ప్రతి రోజూ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైనా నోరు చప్పగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే.. కోడి గుడ్లతోనే వెరైటీలు తయారు చేసుకుంటారు. ఇలా ఇప్పుడు సింపుల్‌గా ఎగ్ పులావ్ తయారు చేసుకోండి. ఇది నోటికి రుచిగా.. టేస్టీగా ఉంటుంది. ఆహారం తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ఈ పులావ్‌ను చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎగ్ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు:

ఉడకబెట్టిన గుడ్లు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి రైస్, ఆయిల్ లేదా నెయ్యి, మిరియాల పొడి, పులావ్ దినుసులు, పెరుగు.

ఎగ్ పులావ్ తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉడక బెట్టుకుని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు కొద్దిగా వేసి.. అందులో కోడి గుడ్లు వేసి వేయించి.. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్‌లో పులావ్ దినుసులు, పుదీనా వేసి కలర్ మారేంత వరకూ వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

నెక్ట్స్ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించి.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతీ రైస్ వేసి ఒకసారి కలుపుకుని సరిపడా వాటర్ వేయాలి. ఇప్పుడు కొత్తి మీర వేసి అంతా ఒకసారి కలుపుకుని.. గుడ్లు కూడా వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.