Ashwagandha Tea: అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

| Edited By: Shaik Madar Saheb

Dec 29, 2024 | 10:15 PM

అశ్వగంధలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇప్పటికీ మనకు పలు రకాల ఆయుర్వేదం షాపుల్లో అశ్వ గంధ పొడి లభిస్తుంది. ఇలాంటి అశ్వగంధతో టీ కూడా పెట్టుకోవచ్చు. వర్షాకాలం, చలి కాలంలో ఈ టీ తాగితే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ ఎంతో చక్కగా లభిస్తుంది..

Ashwagandha Tea: అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
Ashwagandha Tea
Follow us on

అశ్వగంధ గురించి పెద్దగా ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. కానీ దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించేవారు. అశ్వ గంధను ఇప్పుటికీ కొన్ని రకాల మందులు, బ్యూటీ ప్రాడెక్ట్స్‌ తయారీలో యూజ్ చేస్తున్నారు. అశ్వ గంధ చాలా ప్రాచీనమైనది. ఇది ఒక శక్తివంతమైన మూలికగా చెప్పొచ్చు. ఇంగ్లీషులో ఇండియన్ జిన్సెంగ్ అని అంటారు. అశ్వగంధలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇప్పటికీ మనకు పలు రకాల ఆయుర్వేదం షాపుల్లో అశ్వ గంధ పొడి లభిస్తుంది. ఇలాంటి అశ్వగంధతో టీ కూడా పెట్టుకోవచ్చు. వర్షాకాలం, చలి కాలంలో ఈ టీ తాగితే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ ఎంతో చక్కగా లభిస్తుంది. మరి ఈ అశ్వ గంధ టీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అశ్వ గంధ టీకి కావాల్సిన పదార్థాలు:

అశ్వ గంధ పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, అల్లం ముక్క, తేనె.

అశ్వ గంధ టీ తయారీ విధానం:

ముందుగా అశ్వ గంధ పొడి ఆఫ్ స్పూన్, దాల్చిన చెక్క పొడి కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఓ పెద్ద గ్లాస్ నీటిని వేసి బాగా మరిగించాలి. చిన్న మంట మీద ఓ పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరుగుతున్న సమయంలో అల్లం ముక్క దంచి వేసుకోండి. ఈ టీ మరిగిన తర్వాత నేరుగా తాగే వారు తాగేయవచ్చు. అలా తాగలేని వారు కొద్దిగా తేనె కలిపి గోరు వెచ్చగా తాగితే జలుబు, దగ్గు, గొంతు గరగర, జ్వరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఇలా చాలా సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర కూడా పడుతుంది. బాడీ డీటాక్స్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ టీ కొంత మంది తాగకూడదు. గర్భవతులు, బాలింతలు, ఆపరేషన్ చేయించుకున్న వారు, షుగర్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు, అలర్జీ సమస్య ఉన్నవారు, మందులు వాడే వారు ఈ టీ తాగకూడదు. ముందుగా ఈ టీ చిన్న గ్లాస్ పరిమాణంలో తీసుకోండి. వారంలో రెండు సార్లు మాత్రమే తాగాలి.