ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని అంటూ ఉంటారు. ఇది నిజమే. యాపిల్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. పెద్దలకే కాదు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ కొంత మంది పిల్లలు యాపిల్ అంటే అస్సలు నచ్చదు. బలవంతం చేసినా తినరు. కానీ ఈ యాపిల్‌తో పాయసంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు యాపిల్ పాయసం చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు వారికి టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో నట్స్ కూడా యాడ్ చేసుకుంటే మరింత హెల్దీ రెసిపీ అవుతుంది. మరి యాపిల్ ఖీర్ ఎలా తయారు చేసుకుంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్, నెయ్యి, నట్స్, యాలకుల పొడి, పంచదార, పాలు, కండెన్స్‌డ్ మిల్క్.
యాపిల్ ఖీర్ తయారు చేయాలంటే.. ముందుగా పాలు వేడి చేయాలి. మీడియం మంటపై పాలు సగం అయ్యేంత వరకూ మరిగించాలి. ఇలా పాలు చిక్కగా అయ్యేలా చేయాలి. ఇలా చిక్కగా మరిగిన పాలల్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి కలపాలి. ఆ తర్వాత కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. దీంతో ఇది మందంగా మారుతుంది. ఓ రెండు నిమిషాలు ఉడికించి.. తురిమిన యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత పంచదార కూడా వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిగా ఓ రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ ఖీర్ రెడీ అయినట్టే. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడైనా తినొచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయిన తర్వాత తినొచ్చు. వీటిని వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో తయారు చేసుకుని తినొచ్చు. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా ఫాస్ట్‌గా ఈ యాపిల్ ఖీర్ తయారు చేసుకోవచ్చు. కావాలి అనుకున్న వారు సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది.