Homemade Custard Powder: కస్టర్డ్ పౌడర్‌ను పర్‌ఫెక్ట్‌గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు!

| Edited By: Ravi Kiran

Nov 24, 2023 | 11:15 PM

కస్టర్డ్ పౌడర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ తెలుసు. కస్టర్డ్ పౌడర్ తో అనేక రకాలైన తీపి వంటలు చేసుకుంటారు. ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్ వంటి రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ కస్టర్ పౌడర్ ను సాధారణంగా బయట కొంటూ ఉంటారు. అయితే ఈ కస్టర్ పౌడర్ ను కూడా ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఇతర రసాయనాలు కలపకుండా చేసుకోవచ్చు. బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే తయారు..

Homemade Custard Powder: కస్టర్డ్ పౌడర్‌ను పర్‌ఫెక్ట్‌గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు!
Custard Powder
Follow us on

కస్టర్డ్ పౌడర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వారందరికీ తెలుసు. కస్టర్డ్ పౌడర్ తో అనేక రకాలైన తీపి వంటలు చేస్తూంటారు. ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్, బాదం మిల్క్ వంటి రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ కస్టర్ పౌడర్ ను సాధారణంగా బయట కొంటూ ఉంటారు. అయితే ఈ కస్టర్ పౌడర్ ను కూడా ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఎలాంటి ఇతర రసాయనాలు కలపకుండా చేసుకోవచ్చు. బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కస్టర్డ్ పౌడర్ ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కస్టర్డ్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

కార్న్ ఫ్లోర్, పాల పొడి, పంచదార, వెనిలా ఎసెన్స్, ఎల్లో ఫుడ్ కలర్ (ఆప్షనల్).

ఇవి కూడా చదవండి

కస్టర్డ్ పౌడర్ తయారీ విధానం:

ముందుగా ఒక అర కప్పు పంచదారను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పంచదార పౌడర్ ను మెత్తగా జల్లెడ పట్టాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని పక్కకు పెట్టాలి. నెక్ట్స్ అదే మిక్సీ జార్ లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక కప్పు పాల పొడి, వెనీలా ఎసెన్స్ కొద్దిగా, ఫుడ్ కలర్ కొద్దిగా, వేసి మెత్తగా మరోసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పంచదార పొడిలో.. మిక్సీ పట్టిన పౌడర్ వేసి బాగా కలుపు కోవాలి. అంతే ఎంతో రుచిని ఇచ్చే కస్టర్డ్ పౌడర్ సిద్ధం.

ఈ పౌడర్ ను ఎలాంటి గాలి తగల కుండా ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ పౌడర్ ను జల్లించి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారైన కస్టర్డ్ పౌడర్ దాదాపు 6 నెలల వరకూ ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ తో కూడా ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్, బాదం మిల్క్, మిల్క్ షేక్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఎంతో సింపుల్ అయిన ఈ కస్టర్డ్ పౌడర్ ను ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోండి. షాపుకి వెళ్లి కొనాల్సిన పనే ఉండదు.