తెలుగు సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి వచ్చిందే ఇల్లంతా సందడి నెలకొంటుంది. పిండి వంటలు, చుట్టాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతికి చేసే పిండి వంటల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి ఎంతో టేస్టీ, కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చేయాలంటే కాస్త కష్టమే కానీ.. రుచి మాత్రం భలేగా ఉంటుంది. సాధారణంగా జంతికలను బియ్యం పిండితో చేస్తూంటారు. పండుగల్లోనే కాకుండా.. సాధారణంగా వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఇంట్లో ఉన్నాయంటే ఖాళీ అయ్యేంత వరకూ పోటీ పడి తింటూంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా సేమియాలతో జంతికలను కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా గుల్లగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సేమియాలతో మనం పాయసం, ఉప్మా, పులిహోర వంటి వాటిని చేస్తాం. కానీ జంతికలు ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. మరి ఈ సేమియా జంతికలు ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సేమియా జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
సేమియాలు, బియ్యం పిండి, వాము, నువ్వులు, కారం, ఉప్పు, నూనె.
తయారు చేయు విధానం:
సేమియా జంతికలు తయారు చేయాలంటే ముందుగా ఒక చిన్నపాటి గిన్నె తీసుకుని అందులో సేమియాలు వేసి ఓ రెండు, మూడు గంటల పాటు నాన నివ్వాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. ఇలా నానిన సేమియాలను ఒక ఖాళీ పళ్లెం తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, కాస్త వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి. కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ లో జంతికల గొట్టాన్ని తీసుకుని.. దానికి నూనె రాసుకోవాలి.
ఆ తర్వాత ఈ గొట్టంలో పిండిని నింపుకుని వేడి నూనెలో జంతికల షేప్ లో వేసుకోవాలి. వీటిని రెండు వైపులా క్రిస్పీగా, ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా జంతికలు రెడీ. వీటికి గాలి తగలకుండా ఓ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్ ఈసారి మీరు కూడా జంతికలు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.