Healthy Drink for Lungs: ఊపిరితిత్తులను క్లీన్ చేసే హెల్దీ పుదీనా డ్రింక్.. ఎలా చేయాలంటే!

| Edited By: Ravi Kiran

Oct 28, 2023 | 9:30 PM

శ్వాస కోశ సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం, జలుబు ఉన్నవారికి చలి కాలం అస్సలు పడదు. ఈ సీజన్ లో ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊపిరి తిత్తుల్లో కఫం బాగా పేరుకుపోయి.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే శీతా కాలంలో చలి గాలులు బాగా వీస్తాయి.. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరగడానికి కూడా ఉండదు. దీంతో యాంటీ బయోటిక్స్, సిరప్స్ వంటివి వాడుతూ ఉంటారు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ హోమ్ రెమిడీ పాటిస్తే..

Healthy Drink for Lungs: ఊపిరితిత్తులను క్లీన్ చేసే హెల్దీ పుదీనా డ్రింక్.. ఎలా చేయాలంటే!
Pudina Drink
Follow us on

శ్వాస కోశ సంబంధిత సమస్యలు, దగ్గు, కఫం, జలుబు ఉన్నవారికి చలి కాలం అస్సలు పడదు. ఈ సీజన్ లో ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊపిరి తిత్తుల్లో కఫం బాగా పేరుకుపోయి.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే శీతా కాలంలో చలి గాలులు బాగా వీస్తాయి.. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరగడానికి కూడా ఉండదు. దీంతో యాంటీ బయోటిక్స్, సిరప్స్ వంటివి వాడుతూ ఉంటారు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ హోమ్ రెమిడీ పాటిస్తే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఊపిరి తిత్తుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఈ హెల్దీ డ్రింక్ ను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పుదీనా హెల్దీ డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు:

పుదీనా, అల్లం, పసుపు, తేనె.

ఇవి కూడా చదవండి

తయారు చేయు విధానం:

ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి. వీటిలో 10 నుంచి 15 పుదీనా ఆకులు, ఒక అంగుళం అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఈ నీటిని స్టవ్ పై పెట్టి ఓ ఐదు నిమిషాల పాటు మరిగించి, తర్వాత చిటికెడు పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. ఇలా ఇంట్లోనే డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు, శ్వాస కోశ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

హెల్దీ డ్రింక్ ప్రయోజనాలు:

– ఈ డ్రింక్ ఊపిరి తిత్తుల్లో ఉండే ఇన్ ఫెక్షన్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
– ఊపిరి తిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగిపోతుంది.
– ఈ పానీయాన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా తాగవచ్చు. పిల్లలకు అర గ్లాస్ మోతాదులో ఇవ్వాలి. పెద్ద వాళ్లు గ్లాస్ వాటర్ తీసుకోవాలి.
– శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుంది. ఇతర ఇన్ ఫెక్షన్లు సోకకుండా చూస్తుంది.
– ఈ డ్రింక్ తాగడం వల్ల కఫం, జలుబు, దగ్గు సమస్యల నుండి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంట్లోనే తయారు చేసింది కాబట్టి.. ఎటు వంటి హాని కలగకుండా ఉంటుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మేలు.