kitchen Tips: బియ్యం రవ్వను ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు!

| Edited By: Ravi Kiran

Oct 09, 2023 | 7:45 AM

భారతీయులు తినే అల్పాహారంలో ఇడ్లీలు అనేవి కామన్. ఈజీగా, ఫాస్ట్ గా టిఫిన్ అవ్వాలంటే అందరూ ఇడ్లీనే చేస్తారు. ఇడ్లీని తయారు చేసుకోవడానికి ముఖ్యమైన పదార్థాలు రెండు ఒకటి మినపప్పు, రెండోది ఇడ్లీ రవ్వ. చాలా మంది ఇడ్లీ రవ్వను బయట నుంచి కొని తీసుకొస్తారు. ఇప్పుడు దీని రేటు కూడా పెరిగిపోయింది. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇడ్లీ రవ్వను కూడా తయారు చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. ఈ రవ్వతో కూడా ఇడ్లీలు సాఫ్ట్ గా, టేస్టీగా వస్తాయి. దీంతో డబ్బు..

kitchen Tips: బియ్యం రవ్వను ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు!
idli rava
Follow us on

భారతీయులు తినే అల్పాహారంలో ఇడ్లీలు అనేవి కామన్. ఈజీగా, ఫాస్ట్ గా టిఫిన్ అవ్వాలంటే అందరూ ఇడ్లీనే చేస్తారు. ఇడ్లీని తయారు చేసుకోవడానికి ముఖ్యమైన పదార్థాలు రెండు ఒకటి మినపప్పు, రెండోది ఇడ్లీ రవ్వ. చాలా మంది ఇడ్లీ రవ్వను బయట నుంచి కొని తీసుకొస్తారు. ఇప్పుడు దీని రేటు కూడా పెరిగిపోయింది. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇడ్లీ రవ్వను కూడా తయారు చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. ఈ రవ్వతో కూడా ఇడ్లీలు సాఫ్ట్ గా, టేస్టీగా వస్తాయి. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఇడ్లీ రవ్వను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ రవ్వకు కావాల్సిన పదార్థాలు:

ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి రెండే రెండు పదార్థాలు కావాలి. ఒకటి బియ్యం, మరొకటి నీళ్లు.

ఇవి కూడా చదవండి

ఇడ్లీ రవ్వ తయారు చేయు విధానం:

ముందు బియ్యాన్ని ఓ అరకిలో తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత బియ్యం మునిగేంత వరకూ నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని హీట్ చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత బియ్యాన్ని ఒక నిమిషం పాటు అలానే ఉంచి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ బియ్యాన్ని వడకట్టి.. నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఓ రెండు రోజుల పాటు దీన్ని ఎండలో ఆరబెడుతూ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న బియ్యాన్ని తక్కువ మోతాదులో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను జల్లించుకోవాలి.

జల్లించడం వల్ల రవ్వ, పిండి వేరుగా అవుతాయి. ఇలా వచ్చిన రవ్వను డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఇలా స్టోర్ చేసుకున్న రవ్వలో.. రెండు, మూడు లవంగాలను ఉంచితే పురుగు పట్టకుండా ఉంటుంది. అంతే ఎంతో సింపుల్ గా బియ్యం రవ్వను.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక మిగిలిన బియ్యం పిండితో పిండి వంటలు చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే మాత్రం పిండి గిర్నీకి ఇవ్వొచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే.. మీకే తేడా తెలుస్తుంది. పైగా ఇంట్లోనే చేస్తాం కాబట్టి శుభ్రంగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఒక్క సారి మీరు కూడా ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.