Goja Sweet: మైదా, చెక్కర లేకుండా ఈ స్వీట్ ను ఈజీగా చేసుకోవచ్చు.. అదెలాగంటే!

| Edited By: Ram Naramaneni

Oct 12, 2023 | 9:49 PM

మైదా పిండి, చక్కెర లేకుండా స్వీట్స్ ని ఎప్పుడైనా తయారు చేశారా? కానీ ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. నోట్లో ఇలా పెట్టుకోగానే.. అలా కరిగిపోతుంది. స్వీట్ షాపుల్లో తయారు చేసుకునే వాటిల్లో గోజా స్వీట్ కూడా ఒకటి. దీన్ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ స్వీట్ ను మైదా పిండి, షుగర్ తో తయారు చేస్తారు. కానీ ఇవి రెండూ ఆరోగ్యానికి హానికరమన్న విషయం తెలిసిందే. కాబట్టి వీటిని ఈ రెండింటితో కాకుండా వేరే ఇంగ్రీడియన్స్ ఉపయోగించి తయారు..

Goja Sweet: మైదా, చెక్కర లేకుండా ఈ స్వీట్ ను ఈజీగా చేసుకోవచ్చు.. అదెలాగంటే!
Goja
Follow us on

మైదా పిండి, చక్కెర లేకుండా స్వీట్స్ ని ఎప్పుడైనా తయారు చేశారా? కానీ ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. నోట్లో ఇలా పెట్టుకోగానే.. అలా కరిగిపోతుంది. స్వీట్ షాపుల్లో తయారు చేసుకునే వాటిల్లో గోజా స్వీట్ కూడా ఒకటి. దీన్ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ స్వీట్ ను మైదా పిండి, షుగర్ తో తయారు చేస్తారు. కానీ ఇవి రెండూ ఆరోగ్యానికి హానికరమన్న విషయం తెలిసిందే. కాబట్టి వీటిని ఈ రెండింటితో కాకుండా వేరే ఇంగ్రీడియన్స్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ స్వీట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి ఈ స్వీట్ ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోజా స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

బెల్లం, గోధుమ పిండి, యాలకుల పొడి, నూనె, బేకింగ్ పౌడర్, బొంబాయి రవ్వ, నెయ్యి.

ఇవి కూడా చదవండి

గోజా స్వీట్ తయారీ విధానం:

ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా రవ్వను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో గోధుమ పిండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్ల తురుము, కొద్దిగా నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. బెల్లం పాకం జిగురుగా వచ్చేంత వరకు పట్టుకోవాలి. ఆ తర్వా అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు లోతైన కడాయి తీసుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపిన పిండిని తీసుకుని.. నచ్చిన షేప్ లో ఇంచు మందం ఉండేలా వత్తు కోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు వీటిని వేడెక్కిన నూనెలో వేసి మధ్యస్థ మంటపై లోపల ఉడికేంత వరకూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి నెమ్మదిగా పైకి తేలిన తర్వాత మంటన మరింత గగ్గించి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని బెల్లం పాకంలో వేసి.. గోజాలకు పాకం అంతా పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత వీటిని ఐదు నుంచి పది నిమిషాలు అలా వదిలేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోజా స్వీట్ రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.