Chicken Keema Paratha: పిల్లలకు వెరైటీగా చికెన్ కీమా పరాటా చేసి పెట్టండి.. మొత్తం లాగించేస్తారు!

|

Feb 04, 2024 | 7:03 PM

పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ నచ్చదు. ఎప్పుడూ వెరైటీగా ఉండే ఆహారాన్నే ఇష్ట పడుతూ ఉంటారు. అలాగే కొంత మంది పిల్లలు నాన్ వెజ్ అంటే అస్సలు నచ్చదు. ఇలాంటి వారికి ఇలా చికెన్ కీమా పరాటాలు చేసి పెట్టండి. చపాతీలతో పోల్చితే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. వాటిలో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి.. సపరేట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చికెన్ కీమా పరాటా చేసి పిల్లలకు పెడితే.. ఇష్టంగా తింటారు. వీటిని లంచ్ బాక్స్‌లలో..

Chicken Keema Paratha: పిల్లలకు వెరైటీగా చికెన్ కీమా పరాటా చేసి పెట్టండి.. మొత్తం లాగించేస్తారు!
Chicken Keema Paratha
Follow us on

పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ నచ్చదు. ఎప్పుడూ వెరైటీగా ఉండే ఆహారాన్నే ఇష్ట పడుతూ ఉంటారు. అలాగే కొంత మంది పిల్లలు నాన్ వెజ్ అంటే అస్సలు నచ్చదు. ఇలాంటి వారికి ఇలా చికెన్ కీమా పరాటాలు చేసి పెట్టండి. చపాతీలతో పోల్చితే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. వాటిలో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి.. సపరేట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చికెన్ కీమా పరాటా చేసి పిల్లలకు పెడితే.. ఇష్టంగా తింటారు. వీటిని లంచ్ బాక్స్‌లలో కూడా పెట్టొచ్చు. ఈ చికెన్ పరాటాను బ్రేక్ ఫాస్ట్‌గా, లంచ్‌గా, స్నాక్‌గా, డిన్నర్‌గా ఎలాగైనా తినొచ్చు. మరి ఈ చికెన్ పరాటా రెసిపీని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కీమా పరాటాకి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొత్తి మీర, కరివేపాకు, గరం మసాలా, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పెరుగు.

చికెన్ కీమా పరాటా తయారీ విధానం:

ముందుగా గోధుమ పిండిని చపాతీలా పిండి మాదిరి కలుపుకుని పక్కకు పెట్టొడి. ఆ తర్వాత చికెన్‌ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని… అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలుపుకుని ఓ అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక.. కరివేపాకు, ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా చికెన్ ఉడికి పోయాక కొత్తమీర వేసి.. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీంతో స్టఫింగ్ రెడీ అయినట్టే. ఇప్పుడు ముందుగా కలిపి పక్కకు పెట్టిన గోధుమ పిండి తీసుకుని పరాటా మాదిరి చేసుకోవాలి. అందులో చికెన్ స్టఫింగ్ పెట్టి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. వీటిని ఇప్పుడు పాన్ పై వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో టీస్టీ చికెన్ కీమా పరాటా సిద్ధం.