Bread Shahi Tukda: బ్రెడ్‌ షాహీ తుక్డా.. తిన్న వాళ్ల దిమ్మ తిరగాల్సిందే!

| Edited By: Ravi Kiran

Oct 26, 2024 | 10:15 PM

ప్రస్తుతం అన్నీ పండుగల సీజన్సే. పండుగలు అంటేనే తీపి. స్వీట్స్‌తో పండుగల రోజును ప్రారంభిస్తారు. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఒక్కోసారి ఒక్కో టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇక వచ్చేది దీపావళి పండుగ. ఈ పండుగ అంటే స్వీట్ల దుకాణం అంతా ముందే ఉంటుంది. అందరికీ స్వీట్స్, టపాసులు ఇస్తూ ఉంటారు. మరి ఎప్పుడూ ఒకేలా కాకుండా మీ మార్క్ స్పెషల్‌గా కనిపించాలంటే.. మరి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీ తయారు చేసేయండి. అదే బ్రెడ్ షాహీ తుక్డా. ఒక్కసారి ఈ స్వీట్..

Bread Shahi Tukda: బ్రెడ్‌ షాహీ తుక్డా.. తిన్న వాళ్ల దిమ్మ తిరగాల్సిందే!
Bread Shahi Tukda
Follow us on

ప్రస్తుతం అన్నీ పండుగల సీజన్సే. పండుగలు అంటేనే తీపి. స్వీట్స్‌తో పండుగల రోజును ప్రారంభిస్తారు. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఒక్కోసారి ఒక్కో టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇక వచ్చేది దీపావళి పండుగ. ఈ పండుగ అంటే స్వీట్ల దుకాణం అంతా ముందే ఉంటుంది. అందరికీ స్వీట్స్, టపాసులు ఇస్తూ ఉంటారు. మరి ఎప్పుడూ ఒకేలా కాకుండా మీ మార్క్ స్పెషల్‌గా కనిపించాలంటే.. మరి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీ తయారు చేసేయండి. అదే బ్రెడ్ షాహీ తుక్డా. ఒక్కసారి ఈ స్వీట్ టేస్ట్ చేశారంటే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే. నోట్లోంచి మాట రాదు.. కేవలం స్వీట్ మాత్రం కడుపులోకి వెళ్తుంది. అంత రుచిగా ఉంటుంది. తయారు చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. మరి ఈ బ్రెడ్ షాహీ తుక్డాకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ షాహీ తుక్డాకి కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, ఫుల్ క్రీమ్ ఉన్న పాలు, డ్రై ఫ్రూట్స్.

బ్రెడ్ షాహీ తుక్డా తయారీ విధానం:

ఈ స్వీట్‌ని చాలా తక్కువ సమయంలో.. ఈజీగా తక్కువ ఐటెమ్స్‌తో తయారు చేసుకోవచ్చు. చల్ల చల్లగా తింటే ఆహా అంటారు. ముందుగా కడాయి పెట్టి ఇందులో కొద్దిగా వేసి.. బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేయాలి. పాలు చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది. కాబట్ట కాస్త దగ్గరగా చిక్కబడేంత వరకూ మరిగించండి. ఇప్పుడు పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. రుచి బాగుంటుంది. అయితే ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇప్పుడు పాలు దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార నివ్వాలి. ఈ సమయంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్‌లో ఉంచి.. దానిపై పాలు వేయండి. ఇలా ఓ పది నిమిషాలు నాననివ్వండి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే ఆహా అంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ స్వీట్. అంతే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.