Sleep & Weight Loss: ఎక్కువగా నిద్రపోయిన వారు సులభంగా బరువు తగ్గుతారా ? అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే…
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కోంటున్న సమస్య నిద్రలేమి. స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం... ఒత్తిడి కారణంగా అనేక మంది రాత్రిళ్లు
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కోంటున్న సమస్య నిద్రలేమి. స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం… ఒత్తిడి కారణంగా అనేక మంది రాత్రిళ్లు లేకుండా ఉంటున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇక చాలా మంది ఎదుర్కోంటున్న మరో సమస్య అధిక బరువు. వెయిట్ లాస్ అయ్యేందుకు రోజూ వ్యాయమం చేయడమే కాకుండా.. డైట్ ఫాలో అవుతుంటారు. అయితే ఫలితం మాత్రం శూన్యం.
అయితే నిద్ర తగినంతగా ఉంటే.. సులభంగా బరువు తగ్గుతారని… ఇటీవల పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా నిద్రపోతే.. సులభంగా బరువు తగ్గుతారట. మహిళల్లో నిద్ర, బరువు పెరగడం మధ్య లింక్ ఉన్నట్లుగా ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీ హాస్పిటల్ పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగం నిర్వహించిన అధ్యాయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాత్రిళ్లు తక్కువ గంటలు నిద్రపోయే వారు అధిక బరువు కలిగి ఉన్నారని.. 7 గంటలు నిద్రపోయే వారు బరువు తగ్గుతున్నారని తేలింది. అలాగే రోజూ వ్యాయమం చేయడం… తీసుకునే ఆహారంతోపాటు.. తగినంత నిద్ర కూడా బరువు పెరగడం పై ప్రభావం చూపిస్తుందని.. కొలరాడోలోని వైద్యులు జరిపిన పరిశోదనలో తేలింది. ఆకలి కలిగించే హార్మోన్లు లెప్టిన్, గ్రెలిన్ నిద్రలోనే ఉత్పత్తి అవుతాయట. నిద్రలేమి సమస్య ఈ రెండు హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు కండరాలు, కణజాలల పనితీరుపై ప్రభావం ఉంటుంది. సరైన నిద్ర ఉన్నప్పుడు బరువు కోల్పోయే అవకాశం ఉంది.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన అధ్యాయనంలో నిద్రలేమి వలన ఇన్సూలిన్స్ నిరోధకతపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలోని షుగర్ ను శరీర కణాలలోకి శక్తిగా ఉపయోగించుకుంటుంది ఇన్సూలిన్. అయితే నిద్రలేమి సమస్య ఇన్సూలిన్ నిరోధతను కలిగిస్తాయి. డయాబెటిస్ రోగులలో నిద్రలేమి సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది. సరైన నిద్ర ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్, బరువు పెరగడం వంటి సమస్యలను నియంత్రిస్తుంది.
Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సెట్ నుంచి చరణ్ ఫోటోస్ లీక్.. చెర్రీతో అంత క్లోజ్‌గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో ?