
భారతీయ స్వీట్ షాప్స్ లో ఎన్ని రకాల స్వీట్స్ కనిపించినా.. పిల్లలు పెద్దలను ఎక్కువగా ఆకర్షించేంది పాల కోవ. ఇది సాంప్రదాయక మిఠాయి. ఎంతో రుచిగా ఉండే ఈ పాల కోవాని ఇష్టంగా చాలా మంది తింటారు. ఇది పాల కేంద్రాల్లో, స్వీట్ షాప్స్ లో సహా చిన్న చిన్న దుకాణాల్లో దొరుకుతుంది ఈ పాలకోవా. అయితే పండగలు , ఇంట్లో శుభకార్యాలలో పాల కోవాను ఇంట్లో తయారు చేసుకోవాలని చాలా మంది భావిస్తారు. అది కూడా స్వీట్ షాప్స్ లో దొరికే టేస్ట్ తో ఇంట్లోనే ఈ పాల కోవాను సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నోట్లే పెట్టుకుంటే కరిగిపోయే విధంగా టేస్టీ టేస్టీ పాల కోవ తయారీ విధానం తెలుసుకుందాం..
తయారీ విధానం: ముందుగా ఒక దళసరి ఇత్తడి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి .. అందులో తీసుకున్న పాలు పోసి పాలు అడుగు పట్టకుండా మీగడ కట్టకుండా తిప్పుతూ మరిగించాలి. అర లీటర్ అయ్యే వరకూ పాలను మరిగించాలి. బాగా మరిగిన పాలలో పనీర్ వేసి బాగా కలపాలి. అనంతరం పాల పొడి, రోజ్ వాటర్ వేసి ముద్దలు లేకుండా కలిపి యాలకుల పొడి వేసి పాలను బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కబడిన అనంతరం పటిక బెల్లం పొడి లేదా బెల్లం పొడి వేసి పాల మిశ్రమం బాగా గట్టిగా అయ్యేటంత వరకూ కలుపుతూ ఉండాలి. ఇలా గడ్డిపడిన పాల మిశ్రమమే కోవా.. దీనిని చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సిగిన్నె తీసుకుని కోవా మిశ్రమాన్ని వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ కోవా పొడిని సాఫ్ట్‌గా వస్తుంది. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని అరచేతికి నెయ్యి రాసుకుని నచ్చిన ఆకారంలో టిక్కీల్లా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాల కోవా రెడీ అవుతుంది. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..