ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు పండగే.. చికెన్, మటన్, వంటి వాటితో పాటు సీఫుడ్స్ వైపు దృష్టి సారిస్తారు. సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా చాలా రకాలున్నాయి. అయితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చేవి చేపలు. విటమిన్ ఇ అధికంగా ఉండే చేపలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చేపలు.. చికెన్, మటన్ లా వేడి చెయ్యవు కనుక వేసవిలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువుగా చేపలను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే చేపల కూర, పులుసు, ఫ్రై వంటి రెగ్యులర్ ఐటెమ్స్ ను కాకుండా డిఫరెంట్ గా చేసుకుని తినాలని చాలా మంది ఆలోచిస్తారు. ఈ రోజు చేపల తో టేస్టీ టేస్టీ ఫిష్ 65 తయారీ గురించి తెలుసుకుందాం..
ఫిష్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు:
చేపలు – 1/4 కిలో
గుడ్డు – 1
మైదా – ఒక టేబుల్ స్పూన్
కార్న్ ప్లోర్ – ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
చిల్లీ పేస్ట్ – ఒక టీ స్పూన్
కారం – ఒక టీ స్పూన్
పసుపు – అర టీ స్పూన్
ధనియాల పొడి – ఒక టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – అర టీ స్పూన్
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
సోయా సాస్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక గిన్నెలో చేప ముక్కలు వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చిల్లీ పేస్ట్, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, సోయాసాస్ వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. మార్నేట్ చేసిన చేప ముక్కలను పక్కకు పెట్టి.. ఒక అరగంట ఉంచాలి.
తర్వాత ఈ చేప ముక్కల్లో కార్న్ ప్లోర్, మైదా, గుడ్డు వేసి బాగా పట్టేలా మెదపాలి. కొంచెం సేపు పక్కకు పెట్టి.. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. అనంతరం మార్నేట్ చేసిన చేప ముక్కలను నూనె లో వేసి మంట స్విమ్ లో పెట్టి వేయించాలి. దోర రంగు వచ్చే వరకు చేప ముక్కలను వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నిమ్మ ముక్క, ఉల్లి పాయ ముక్కలు, టమాటా సాస్, సిల్లీ సాస్ లతో కలిపి ఇస్తే.. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..