పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?

|

Dec 19, 2021 | 8:27 AM

Dry Fruits : కరోనా సమయంలో రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. చలికాలంలో ముఖ్యంగా చాలా

పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?
Dry Fruits
Follow us on

Dry Fruits : కరోనా సమయంలో రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. చలికాలంలో ముఖ్యంగా చాలా రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సమయంలో పెద్దలు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. నిజానికి చలికాలంలో పిల్లలకు ఎక్కువగా జలుబు వస్తుంది. దీనివల్ల దగ్గు, జలుబు వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మందులతో కాకుండా ఇంటి చిట్కాలతో కూడా వీటిని తగ్గించవచ్చు. అయితే చలికాలంలో రోగనిరోధక శక్తికోసం పిల్లలకు ఇవ్వాల్సిన కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.

1. బాదం
డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం తినడం చాలా ముఖ్యం. రోజూ పిల్లలకు బాదంపప్పు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. బాదంపప్పులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదంపప్పులను పిల్లలకు ప్రతిరోజు ఇవ్వండి.

2. వాల్నట్
బ్రెయిన్ ఫుడ్ అని పిలిచే వాల్ నట్స్ లో శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్ల గురించి మాట్లాడుతూ.. B1, B2, B6 కలిగి ఉంటాయి. చలిలో పిల్లలకు వాల్‌నట్‌లను ఇవ్వండి ఎందుకంటే ఇది లోపలి నుంచి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3. పిస్తాపప్పు
పిస్తాలో ఇనుము, పొటాషియం, రాగి, భాస్వరం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అంతే కాదు ఇందులో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి ఈ ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిస్తాపప్పు తినడానికి కూడా రుచిగా ఉంటుంది. దీనివల్ల పిల్లలకు తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలని వ్యాధుల నుంచి దూరంగా ఉంచండి.

ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి ఫిదా అవుతున్న జనాలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

కెనడాలో విచిత్రం.. గర్భిణీలో పిండం కడుపులో కాకుండా లివర్‌లో పెరుగుతుంది..

బిజినెస్‌లో ప్రభుత్వ బ్యాంకులను అధిగమిస్తున్న ప్రైవేట్‌ బ్యాంకులు.. కారణం ఏంటో తెలుసా..?