Anti Inflammatory Foods: వంటగదిలో ఉపయోగించే కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషక గుణాలు నొప్పి, మంట వాపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా చాలామందిని ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు వెంటాడుతుంటాయి. కడుపులో మంటతో పాటు కీళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు బాగా వేధిస్తుంటాయి. వీటి వల్ల అటు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రెగ్యులర్‌గా మందులు వాడడంతో పాటు కొన్ని ఆహారంలో కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలను చేర్చుకుంటే ఇన్‌ఫ్లమేటరీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే రసాయం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
నల్ల మిరియాలు
యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ ఇలా ఎన్నో గుణాలతో నిండిఉంటాయి నల్లమిరియాలు. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది.
యాలకులు
అందరి వంటిళ్లలోనూ ఉండే యాలకులు మంటను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అదేవిధంగా కాలేయంలోని కొవ్వును కూడా నియంత్రిస్తాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది వాపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాల్చినచెక్కను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
అల్లం
అల్లం టీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వాపు సమస్యలను నియంత్రించడంలో ఇది ఎంతో ఉత్తమం. ముఖ్యంగా జలుబు, పీరియడ్స్ క్రాంప్స్, మైగ్రేన్, వికారం, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు తదితర సమస్యలను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి
కీళ్లనొప్పులు, దగ్గు, మలబద్ధకం, ఇతర వ్యాధుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు వెల్లుల్లి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నిండుగా ఉంటాయి.
మెంతికూర
కీళ్ల నొప్పులు, మలబద్ధకం, ఉబ్బరం తదితర ఉదర సంబంధిత సమస్యలున్నవారికి మెంతికూర మంచి ఆహారం. అంతేకాదు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
థైమ్ సీడ్స్
వంటలకు సువాసన అందించే థైమ్ గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం
గ్రీన్ టీ
గ్రీన్‌టీలో ఉండే పోషకాలు ఇన్‌ఫ్లమేషన్ సమస్యలను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
(గమనిక: ఈకథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని TV9 డిజిటల్ ధృవీకరించడం లేదు. సరైన మార్గదర్శకత్వం లేదా చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..