Health Tips: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. వీటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు..

Uric Acid: యూరిక్ యాసిడ్ ఏర్పడటం సమస్య కాదు. కానీ, మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయనప్పుడు శరీరం నుంచి తొలగించకపోతే, అది వ్యాధికి కారణమవుతుంది.

Health Tips: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. వీటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
Uric Acid
Follow us
Venkata Chari

|

Updated on: Sep 07, 2022 | 7:12 PM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం మన ఆహారం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోలేకపోతున్నాం. సరైన ఆహారపు అలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి వల్ల మనకు తెలియకుండానే ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నాం. యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఇందుకు ఓ కారణం. యూరిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తయారయ్యే శరీరపు టాక్సిన్స్, మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేసి శరీరం నుంచి సులభంగా తొలగిస్తాయి. యూరిక్ యాసిడ్ ఏర్పడటం సమస్య కాదు. కానీ, మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయనప్పుడు శరీరం నుంచి తొలగించకపోతే, అది వ్యాధికి కారణమవుతుంది.

ఆహారంలో ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, జన్యుపరమైన సమస్యలు, హైపోథైరాయిడిజం, కిడ్నీ సమస్యలు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడానికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడంతో, కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది గౌట్‌కు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, దాని అతిపెద్ద ప్రభావం పాదాలపై కనిపిస్తుంది. కాలి బొటనవేలులో భరించలేని నొప్పి ఉంది. పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా, కాళ్ళలో నొప్పి, వాపు, కీళ్ల నొప్పులు ఎక్కువ ఫిర్యాదులు వస్తుంటాయి.

యూరిక్ యాసిడ్ నియంత్రణకు, ఆహారంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్‌ను వేగంగా నియంత్రించే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అందులో వాల్‌నట్ ఒకటి. ఈ డ్రై ఫ్రూట్ యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వారు రోజూ వాల్ నట్స్ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వాల్‌నట్స్ యూరిక్ యాసిడ్‌ను ఎలా నియంత్రిస్తాయి..

వాల్‌నట్ వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతమైనదని రుజువు చేస్తుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ యూరిక్ యాసిడ్ ను నియంత్రిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న వాల్‌నట్స్‌లో విటమిన్ బి6, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లో ఉండే ప్రొటీన్ గౌట్ వ్యాధికి చికిత్స చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల కీళ్లలో నిక్షిప్తమైన స్ఫటికాలు మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తాయి.

వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో వాల్‌నట్ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న వాల్ నట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. వాల్‌నట్‌లను తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు ఆహారంలో వాల్‌నట్‌లను తీసుకుంటే కొవ్వు త్వరగా తగ్గుతుంది.