Summer Special Kulfi: సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ కుల్ఫీ.. బ్రెడ్‌తో 10 నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా..

|

Mar 31, 2023 | 11:45 AM

రుచికరమైన ఈ కుల్ఫీలను  బ్రెడ్ ను ఉపయోగించి ఇంట్లోనే టేస్టీ గా ఈజీగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.. ఈ రోజు సమ్మర్ స్పెషల్ కుల్ఫీలను తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.. 

Summer Special Kulfi: సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ కుల్ఫీ.. బ్రెడ్‌తో 10 నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా..
Kesar Pista Kulfi
Follow us on

వేసవి వచ్చిందంటే చాలు.. మనసు చల్లదనం కోరుతుంది. దీంతో చల్లచల్లగా ఉండే ఆహారాన్ని, కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్, కుల్ఫీ  వంటి వాటిపై దృష్టి సారిస్తారు. చాలామంది ఐస్ క్రీమ్ పార్లర్ లో దొరికే కుల్ఫీలను తినడానికి ఇష్టపడతారు. అయితే రుచికరమైన ఈ కుల్ఫీలను  బ్రెడ్ ను ఉపయోగించి ఇంట్లోనే టేస్టీ గా ఈజీగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.. ఈ రోజు సమ్మర్ స్పెషల్ కుల్ఫీలను తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..

ఆరు కుల్ఫీల తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

బ్రెడ్ స్లైడ్స్ –  రెండు

ఇవి కూడా చదవండి

కండెన్డ్స్ మిల్క్ – ఒక కప్పు

వేడి వేడి పాలు – పావు లీటర్

ఫ్రెష్ క్రీమ్ – ఒక క‌ప్పు,

కుంకుమ పువ్వు – చిటికెడు (వేడి పాల‌ల్లో నాన‌బెట్టిన)

యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్,

పిస్తా

జీడిప‌ప్పు

కుల్ఫీ అచ్చులు – అర డజను

నెయ్యి- కొంచెం

బియ్యం –

కుల్ఫీ త‌యారీ విధానం: ముందు కుంకుమ పువ్వుని వేడి పాలల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని  వాటి చుట్టూ ఉన్న అంచుల‌ను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని.. గోరు వెచ్చ‌ని పాల‌ను పోసి రెండు  నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీని తీసుకుని దానిలో నానిన బ్రెడ్ స్లైడ్స్ ను పాలతో కలిపి మెత్త‌గా మిక్సీ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమంలో కండెన్డ్స్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ , నాన‌బెట్టిన కుంకుమ పువ్వు, యాల‌కుల పొడి వేసి మ‌రోసారి మిక్సీ వేసుకోవాలి.

ఇప్పుడు కుల్ఫీ అచ్చుల‌ను తీసుకుని వాటికీ నెయ్యి రుద్ది.. అందులో కొన్ని పిస్తా ప‌లుకులు, బాదం ప‌లుకులు వేసుకోవాలి. అనంతరం రెడీ చేసుకున్న కుల్ఫీ మిశ్ర‌మాన్ని వేసి .. మూత పెట్టుకోవాలి. కుల్ఫీ అచ్చులు లేని వారు.. మూత ఉన్న చిన్న చిన్న పాత్రలు తీసుకోవచ్చు. ఒక గిన్నెలో బియ్యం పోసి.. అందులో కుల్ఫీ మిశ్రమంతో నింపిన కుల్ఫీ అచ్చుల‌ను క‌ద‌ల‌కుండా పెట్టుకోవాలి. అనంతరం వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి.. దాదాపు 12 గంటల పాటు ఉంచాలి.  తర్వాత కుల్ఫీలకు పుల్ల గుచ్చి ఆ కుల్ఫీ అచ్చులను నీటిలో పెట్టుకుని తీసుకోవాలి. అంతే మార్కెట్ లో దొరికే టేస్టీ టేస్టీ ఇనిస్టెంట్ కుల్ఫీ రెడీ..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..